భా.జ.పా నాయకత్వం ఏం చేయనుంది…?

0
29

తాజా కబురు తెలంగాణ: ఓవైపు తెలంగాణ రాష్ట్రంలో భాజపా నాయకుల అరెస్టులు, మరో వైపు భాజపాను రాష్ట్రంలో అణచివేయాలనే కుట్రలు కొనసాగుతున్నాయనే ఆరోపణల నేపత్యంలో బుధవారం బండి సంజయ్ ని వెంటనే విడుదల చేయాలనీ హైకోర్టు ఆదేశాలతో…భాజపా రాష్ట్ర నాయకులు,కార్యకర్తలు సంబరాలతో సరిపెట్టుకుంటారా..? ఎప్పటి లాగే అవినీతిని బయటపెడతాం అంటూ తెరపైకి వస్తారా…? అంటూ తెలంగాణ రాష్ట్రంలోని గ్రామ స్థాయిలో ఇప్పటినుండే పలువురు యువత అడ్డాల వద్ద చర్చించుకుంటున్నారు. ఒకవేళ ఎప్పటి లాగే కేసీఆర్,కేటీఆర్ ఇతర నాయకులపై భా.జ.పా నాయకులు విమర్శలు చేయడంతో సరిపెట్టుకుంటే… తిరిగి ఇదే సీన్ రీపీట్ కానుందా…? అలా ఐతే ఇక బీజీపీ నాయకుల మాటలు కూడా జనానికి కామన్ గానే వినిపించనున్నాయా…? మోడీ, అమిత్ షా లాంటి నాయకుల చూపు ఇకపై తెలంగాణా వైపు ఉంటుందా… ? అసలు భాజపా నాయకత్వం తెలంగాణాలో అవినీతిని ఎలా బయటకు తీస్తుంది..? మాటలతోనే కార్యకర్తల్లో జోష్ పెంచుతారా… కొత్తగా ఇంకేమైనా చేసి చూపిస్తారా అంటూ ఇప్పటి నుండే గ్రామాల్లో యువత చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా రాష్ట్ర రాజకీయాల్లో భా.జ.పా ఎత్తుకు పై ఎత్తు వేస్తుందా లేదా వేచి చూడాల్సిందే…!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here