విద్య,వైద్యం,ఉపాధియే ప్రతిమ ఫౌండేషన్ లక్ష్యం:డా.చెన్నమనేని వికాస్-దీప

0
59

జగిత్యాల తాజాకబురు:జగిత్యాల జిల్లా మేడిపల్లి మండల కేంద్రంలోని రైతు ఐక్య వేదిక ఆవరణలో ప్రతిమ ఫౌండేషన్,ప్రతిమ వైద్య విజ్ఞాన సంస్థ నగునూర్,కరీంనగర్ సహకారంతో బుధవారం 1200 మంది మహిళలకు,స్థానిక జిల్లా పరిషత్,కస్తూరీబా గాంధీ, మోడల్ స్కూల్ విద్యార్థినిలకు 3 నెలలకు సరిపడా న్యాప్ కిన్స్ ని డా. చెన్నమనేని వికాస్-దీప,గ్రామ సర్పంచ్ క్యాతం వరలక్ష్మి మహేంధర్ రెడ్డి పంపిణి చేశారు. ఈ సంధర్బంగా ప్రముఖ రేడియాలజిస్ట్ డాక్టర్ చెన్నమనేని వికాస్-దీప మాట్లాడుతూ కరోనా సమయంలో ఉపాధి దెబ్బతిని,ఆర్థిక కారణాల వల్ల, రవాణా సౌకర్యాలు లేకపోవడంతో చాల మంది వ్యాధి గ్రస్తులు దవాఖానాలోకి వెళ్ళలేకపోయారని దానితో చాల మంది ప్రాణాలు కోల్పోయారని గుర్తించిన ప్రతిమ ఫౌండేషన్ ఆరోగ్యం మీ ఇంటి ముందుకు తేవడం కోసం 5 కోట్ల రూపాయలతో ఆరోగ్య రథాన్ని ఏర్పాటు చేసి ఎక్సరే, ఎలక్ట్రో కార్డియోగ్రామ్, 2డి ఇకో, కార్డియాక్ ప్రొఫైల్, పాప్ స్మియర్, మమ్మో గ్రఫీ, మినీ ల్యాబ్ వంటి అత్యాధునిక వైద్య సేవలను ప్రతిమ సంచార ఆరోగ్య రథం ద్వారా అందించడం జరుగుతుందని, తీవ్ర వ్యాధులను ముందుగా గుర్తించడం ద్వారా జీవన శైలి ని మెరుగు పర్చడం జరుగుతుందని అన్నారు.విద్య,వైద్యం,ఉపాధియే ప్రతిమ ఫౌండేషన్ లక్ష్యం అని గ్రామాలే స్వావలంబన, స్వపరిపాలనకు కేంద్ర బిందువులు కాబట్టి గాంధీ జి చెప్పినట్లు గ్రామస్వరాజ్యం వచ్చినపుడే మన దేశంలో రామ రాజ్యం వస్తుందని చెప్పినట్లు గ్రామాల సర్పంచుల సహకారంతో మరిన్ని సేవ కార్యక్రమాలు చేపడుతామని అన్నారు.మేడిపల్లి మహిళలు కుట్టు మిషన్ వంటి ఉపాధి అవకాశాలను కల్పించాలని కోరగా స్వయం ఉపాధి, మహిళా సాధికారత కోసం సహకరిస్తామని హామీ ఇచ్చారు.అనంతరం ప్రముఖ స్త్రీ వైద్య నిపుణురాలు డా. ప్రియాంక మహిళల వ్యక్తి గత పరిశుభ్రతగర్భిణీ స్త్రీలకు,రొమ్ము గడ్డలు,ఋతుక్రమం ఆగిపోవుట (మోనోపాజ్)లక్షణాలు, మోనోపాజ్ దశలో పడే ఇబ్బందులు,మహిళలో వచ్చే రొమ్ము క్యాన్సర్,సర్వీకల్ క్యాన్సర్ వంటి అంశాలపై స్త్రీలు,ఆడపిల్లల సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహనా కల్పించి అవసరమైన వారికి సి.బి.పి, రక్త పరీక్షలు,పాప్ స్మియర్, మమ్మో గ్రఫీ పరీక్షలను ఉచితంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ మధు సూధన్ ప్రతిమ ఆసుపత్రి వైద్యులు, ఫౌండషన్ సిబ్బంది పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here