ఈ రోజు వేయి స్తంభాల రుద్రేశ్వరాలయాన్ని కిషన్ జి తో పాటు మీరు దర్శించుకోండి

0
34

తాజా కబురు హనుమకొండ: హనుమకొండ శుక్రవారం రోజున కేంద్ర పర్యాటక సాంస్కృతిక ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి కిషన్ రెడ్డి హనుమకొండ జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి వేయి స్తంభాల గుడినీ సందర్శించారు.ఈ సందర్భంగా మంత్రికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం మంత్రికి రుద్రేశ్వరుడు అభిషేకం చేసి దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఆశీర్వచనం ఇచ్చి స్వామివారి పట్టువస్త్రాలు బహూకరించిన వేయి స్తంభాల గుడి ఆలయ అర్చకులు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కరోనా మహమ్మారి నుండి ప్రపంచాన్ని కాపాడాలని ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు. హనుమకొండ నగరంలోని భద్రకాళి ఆలయం పర్యాటక కేంద్రంగా మారనుందని ఇందులో భాగంగానే హృదయ స్మార్ట్ సిటీ పథకం నిధులతో అభివృద్ధి చెందిందన్నారు. అతి పురాతన ఆలయం వేయి స్తంభాల గుడి అని అన్నార భద్రకాళి దేవాలయానికి వేయి స్తంభాల రుద్రేశ్వరాలయ ఎంతో అనుబంధం ఉందని ఈ రెండు దేవాలయాలు కాకతీయుల కాలంలో నిర్మితమైన అని అన్నారు. జిల్లాలోని దేవాలయాల అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. అనంతరం మంత్రి అదాలత్ జంక్షన్లోని అమర వీరుల స్తూపం వద్ద అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here