తెలుగుదేశం పార్టీ కి రాయికల్ మండల నాయకుల రాజీనామా

0
53

తాజా కబురు జగిత్యాల: జగిత్యాల జిల్లా రాయికల్ మండల టి.డి.పి అధ్యక్షులు రుక్కు తో పాటుగా ఆ పార్టీ మండల నాయకులు వారి వారి పదవులకు రాజీనామా చేసి, తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి రాజీనామా లేఖలను పంపినట్లు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.తెలంగాణ రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో టిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు లేఖలో పేర్కొన్నారు.మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ప్రజలకు మరింత చేరువగా మండల ప్రగతిలో భాగస్వామ్యం కావాలనే భావనతో తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.తెలుగుదేశం పార్టీ రాయికల్ మండల అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.ఆయనతో పాటు ప్రధాన కార్యదర్శి కునుమల్ల రాజం,బిసీ సెల్ జిల్లా అధ్యక్షులు కట్కం రాజేశం,జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు సోమనారాయణరెడ్డి, తెలుగు యువత అధ్యక్షుడు కంటె గంగారాం,ఎల్లాగౌడ్,గుండేటి చంద్రయ్య లు టి.ఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు.తెలంగాణ తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు ఎల్.రమణ టి.ఆర్ఎస్ పార్టీలో సభ్యత్వం తీసుకోబుతున్న సందర్భంగా ఆయన అడుగుజాడల్లో నడువాలని నిర్ణయించుకున్నట్లు వారు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here