సారూ మా భూమి లాక్కోవద్దంటూ తహసీల్దార్ కాళ్ల మీద పడ్డ మహిళా రైతు

0
19

తాజా కబురు హనుమకొండ:వరంగల్ ఉమ్మడి జిల్లాలో సాగు జీవనాధారంగా చేసుకొని వ్యవసాయం చేసుకుంటున్న తమ భూమిని లాక్కో వద్దని ఓ మహిళా రైతు తహసీల్దార్ మహబూబ్ అలీ కాళ్లపై పడి ప్రాధేయపడినా హృదయ విదారక ఘటన వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి లో చోటుచేసుకుంది. తన కుమారుడైన కుమారస్వామి కి చెందిన 2.20 ఎకరాల భూమి 25 ఏళ్లుగా సాగు చేసుకుంటున్నామని అభివృద్ధి పేరుతో వ్యవసాయ భూమిని తీసుకొని మా పొట్ట కొట్టొద్దు అంటూ, ఆ వృద్ధురాలు పర్వతగిరి తహసీల్దార్మహబూబ్ అలీ కాళ్ళపై పడింది. అయితే ఇటీవలే అర్బన్ ప్రాజెక్ట్ క్రింద పర్వతగిరి పట్టణంలో అసైన్డ్ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోగా ఆ భూమిని పరిశీలించేందుకు వచ్చిన ఎమ్మార్వో కాళ్లపై పడి తమ జీవనాధారమైన భూమిని లాక్కో వద్దని కన్నీటిపర్యంతమయ్యారు మహిళా రైతు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here