అన్నా, చెల్లెల అనుబంధానికి ప్రతీక రాఖీ పండుగ

0
71

-అన్నా నిను మరువమంటూ పార్సిల్ లో రాఖీలు
జగిత్యాల సోదరీ మణులు అన్నా,తమ్ముడికి ప్రతి ఏటా రాఖిపౌర్ణమి రోజు రాఖీలు కట్టి అన్నా, చెల్లెళ్ళ మధ్య అనుబంధాన్ని చాటిచెప్పే పండుగ రాఖీ పండుగ.ప్రతి ఏటా శ్రావణమాసం పౌర్ణమి రోజున రాఖీ పండుగను ఆనం త్సవలమధ్య జరుపుకుంటారు.పల్లెలు, పట్టణాల్లో మహిళలు,యువతులు,చిన్నారులు రాఖీలు కొనుగోలుచేస్తుండడంతో దుఖనాలు రద్దిగా మారాయి.జగిత్యాల జిల్లా వ్యాప్తంగా పట్టణంలో వివిధరకాల రాఖీలను వ్యాపారాలు విక్రయాలు జరిపడానికి పెద్ద ఎత్తున దుకాణల ముందు ప్రదర్శిస్తున్నారు.దూరప్రాంతాల్లో ఉన్న సోదరులకు అక్కా,చెల్లెల్లు పార్సిల్ ద్వారా రాఖీలు పంపిస్తూ అన్నా నిన్ను మరువమంటూ రాఖీ విశిష్టతను కొందరు కొనసాగిస్తున్నారు.
అన్నా, చెల్లి అనుబంధం జన్మ, జన్మలా సంబంధం అంటూ సోదర, సోదరిమనుల విశిష్టత ఎంత గొప్పదో సినీ కవులు వివరించారు.ప్రతీ అక్కా, చెల్లి తన సోదరుడికి రాఖీ కట్టేందుకు శ్రావణమాసం మొదలయినానుంచే ఎప్పుడు వస్తదా పండుగాని ఎదురుచూస్తుంటారు.రాఖీ పండుగ అంటే శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమినీ రాఖీ పౌర్ణమి అని పిలుస్తుంటారు.రాఖీ పండుగకు చాలా విశిష్టత ఉంది.రాఖీ పండగ సందర్భంగా సొంత సోదరులు లేనివారు చాలా మంది బాధపడుతుంటారు.తమకంటూ ఒక అన్నో.. తమ్ముడో ఉంటే సంతోషంగా పండగ జరుపుకునే వారమని ఆనందం వ్యక్తం చేస్తుంటారు.అయితే కొంతమంది మహిళలు సొంత సోదరులు లేకున్నాఫ్యామిలీ ఫ్రెండ్ షిప్ లోనివారికి యేటా రాఖీలు కడుతు కొత్త అనుభూతిని పొందుతుంటారు.గత ఏడాది కరోనా విజృంభణ కారణంగా చాలామందికి పాజిటివ్ వచ్చి రాఖీ కట్టించుకోలేదు. ఇండ్లనుంచి కూడా బయటికి వెళ్ళడానికి భయపడ్డారు.సోదరికో.. సోదరుడికో కరోనా పాజిటివ్ వచ్చి రాఖీకి దూరమై.. వైరస్ నుంచి కోలుకోవడంతో పాటు ప్రభుత్వం లాక్ డౌన్ ఎత్తివేయడంతో ఈ సారి రాఖీ కట్టెందుకు మహిళలు సమయాత్తమై రాఖీలు కోనెందుకు వెళ్లడంతో దుకాణాల వద్ద రద్ది ఏర్పడింది.పదిరోజుల ముందే నుంచే ఎలాగైనా సోదరులకు రాఖీ కట్టడంకోసం అక్క -చెల్లెల్లు ఆలోచిస్తుంటారు.రాఖీ పండగకు దూర ప్రాంతాల నుంచి అంటే విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే తోబుట్టువులకు రాఖీ కట్టి అనుబంధాన్ని కొనసాగిస్తుంటారు.ఇలాంటి మధురానుభూతి మాటల్లో చెప్పనలవికాదు.సోదరులు అందించే కానుకలను మురిపెంగ తీసుకొని ఆనందపడుతారు.రాఖీ పండగ సందర్భంగా అధికారులు, ఉద్యోగులు విధుల్లో బిజీగా ఉన్నప్పటికీ అనుబంధాన్ని కొనసాగిస్తూ అనుదుబాటులో ఉంటే సోదరులతో రాఖీలు కట్టించుకుని సంబారపడుతారు.
అన్నా నిను మరువం
ప్రస్తుత కాలంలో పెళ్లికాకముందు, పెళ్లయిన తరువాత కొద్దిరోజులు మాత్రమే రాఖీ కడుతున్నవాళ్లు చాలా మందినీ చూస్తున్నాం. దూరప్రాంతాల్లో ఉన్నవారికి కొరియర్, పార్సిల్, పోస్టు ద్వారా పంపిస్తూ, దగ్గరలో ఉంటే ఇంటికి వెళ్లి రాఖీ కడుతూ ఆప్యాయతలను పంచుకుంటారు.అయితే పలుచోట్ల వృద్ధులు సైతం వారి సోదరులను మరవకుండా రాఖీ కడుతూ ఆత్మీయతను పంచుకుంటున్నారు.
అన్నా రాఖీ పంపిన….
చాలా మంది సోదరులు, సోదరిమణులు ఉద్యోగ, ఇతర కారణాల దృష్ట్యా కలిసేందుకు వీలు ఉండదు కాబట్టి రాఖీ కట్టేందుకు సాధ్యం కాని పరిస్థితుల్లో పోస్టల్, కొరియర్,పార్సిల్ సేవలను వినియోగించుకుని రాఖీలు పంపిస్తుంటారు. ఫోన్ చేసి అన్నా రాఖీ పంపించాను కట్టుకొండని చెబుతుంటారు.దీంతో సోదరులు పౌర్ణమి రోజున సోదరీ పంపిన రాఖీనీ కట్టుకొని అనుబంధాన్ని నెమరువేసుకుంటారు.రాఖీ పండగ సందర్భంగా వివిధ రకాల, రంగుల రాఖీలు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. ఇవేకాకుండా చాలా మంది సొంతంగా రాఖీలు తయారు చేస్తుంటారు. కొంచెం డిఫరెంటుగా తయారు చేసి తమ సోదరుకలు కట్టి మురుస్తుంటారు.

సోదరభావాన్ని పెంపోందించేది రాఖీ పండుగ : సర్పంచ్ శోభారాణి

సోదరాభవాన్ని పెంపోందించేది రాఖీ పండుగని బతికేపల్లి సర్పంచ్ తాటిపర్తి శోభారాణి అన్నారు. సోదరులకు రాఖీలు కట్టెందుకుపండుగ కోసం ఎదురుచూసిన సందర్బలున్నాయి.రాఖీ పండుగకు చాలా విశిష్టత ఉంది.ఉమ్మడికుటుంబాలున్న సమయంలో రాఖీ పండుగ రోజు ఎంతో సందడి ఉండేది.

అన్నా చెల్లెలా అనుబంధానికి ప్రతీక :గృహిణి చింత రోజా

అన్నా, చెల్లెళ్ళ అనుబంధానికి రాఖీ పండుగ ప్రతికగా నిలుస్తుందనీ జగిత్యాల పట్టణానికి చెందిన గృహిణి చింత రోజా అన్నారు.రాఖీ పౌర్ణిమ సోదర, సోదరీమనుల్లో ఆనందాలు నింపే రోజు. రాఖితో అనుభందనాలు బలపడుతాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here