ప్రజలంతా బీజేపీ వైపు చూస్తున్నరు -మాజీ జడ్పీ చైర్ పర్సన్ తుల ఉమ

0
16

జగిత్యాల తాజా కబురు: జగిత్యాల జిల్లా మేడిపల్లి మండల కేంద్రంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా మాజీ జడ్పీ చైర్ పర్సన్ తుల ఉమ భారతీయ జనత పార్టీలో చేరిన సందర్భంగా మేడిపల్లి మండల కేంద్రంలో కార్యకర్తల పరిచయ వేదికను ఏర్పాటు చేశా రు. ఈ సంధర్బంగా భా.జ.పా మండల అధ్యక్షులు ముంజ శ్రీనివాస్ మాట్లాడుతూ వేములవాడ నియోజకవర్గములో బీజేపీ జెండా ఎగరవేయడమే లక్యంగా ప్రతీ ఒక్క కార్యకర్త కష్టపడాలని అన్నారు. అనంతరం తుల ఉమ మాట్లాడుతూ రాష్ట్రములో తె.రా.స ప్రభుత్వంని ప్రజలు వ్యతిరేకిస్తున్నారని, ప్రజలంతా బీజేపీ వైపు చూస్తున్నారని, ప్రజలకు మనం అండగా ఉండి భరోసా ఇవ్వాలని, ప్రతీ కార్యకర్త బీజేపీ అధికారంలోకి రావడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వేములవాడ నియోజకవర్గ కన్వీనర్ క్యాతం దశరథ రెడ్డి,మండల ఇంఛార్జి వెంకటేశ్వర్లు,కాటిపెళ్లి జగన్,మకిలి ఇజ్రాయిల్, అన్నాడి జలపతి రెడ్డి, ఎస్.ఎన్ రెడ్డి,పల్లి జామున,ధర్మారెడ్డి, తిరుపతి రెడ్డి,రాజు,యువమోర్చా జిల్లా ప్రదాన కార్యదర్శి క్యాతం మహేందర్ రెడ్డి,యువమోర్చా మండల అధ్యక్షులు గొస్కి మధు,అధికార ప్రతినిధి రఘు,మిట్టపల్లి తిరుపతి రెడ్డి, సాయికుమార్,లీగల్ సెల్ జిల్లా కన్వీనర్ ప్రవీణ్, బాలసాని మారుతీ గౌడ్,దూరిశెట్టి సత్యనారాయణ,దూరిశెట్టి రాములు,రమేష్,లక్మిపతి, దోనిపాల శంకర్ కార్యకర్తలు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here