మెట్పల్లి లో మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం

0
50
  • మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నిరుద్యోగుల పట్ల చేసిన వ్యాఖ్యలకు బహిరంగ క్షమాపణ చెప్పాలి: బీజేవైఎం డిమాండ్

తాజాకబురు జగిత్యాల జిల్లా: జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని పాత బస్ స్టాండ్ ఆవరణలో శుక్రవారం బీజేవైఎం పట్టణ శాఖ ఆధ్వర్యంలో మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గురువారం నాగర్ కర్నూల్ జిల్లాలో దిశ రివ్యూ మీటింగ్ కు హాజరై నిరుద్యోగులు హమాలీ పని చేసుకోవచ్చు అనే వాక్యాలకు నిరసనగా నిరంజన్ రెడ్డి దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ సంధర్బంగా బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధోనీకేల నవీన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయినా నుండి తెరాస ప్రభుత్వం ఎన్ని నియామకాలు చేపట్టిందో తెలపాలని, ఉద్యమ సమయంలో విద్యార్థులు, నిరుద్యోగులు చేసిన త్యాగాలను మర్చిపోయి మంత్రి నిరుద్యోగులను హమాలీ పని చేసుకోవచ్చు అని అనడం నిరుద్యోగ యువతను అవమానించడమే అవుతుందని మంత్రి వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని బీజేవైఎం తరుపున డిమాండ్ చేశారు.నిధులు,నీళ్ళు,నియామకాల పేరుతో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన ఘనత తె.రా.స ప్రభుత్వానికే చెందుతుందని, ఉద్యోగ నోటిఫికేషన్ లు లేక నిరుద్యోగుల ఆత్మ హత్యలకు తెరాస ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత అని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు బోడ్ల రమేష్,ఐటి సెల్ జోనల్ ఇంచార్జ్ మిట్టపల్లి సాయి, పట్టణ అధ్యక్షులు ఆర్మూర్ రంజిత్, ప్రధాన కార్యదర్శి గోపనావేని రమేష్యాదవ్, అరిగేలా అజయ్, పుల్లూరు వెంకటేష్, కిషన్ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులు లోలపు అనిల్,కోరుట్ల రాజు,సిహెచ్.రమేష్,జక్కని నందు,అజయ్,రవి,ప్రశాంత్, శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here