మంత్రి ఎర్రబెల్లిని పదవిలోంచి తొలగించాలి- తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు పసుల రామ్మూర్తి డిమాండ్

0
29

తాజా కబురు జగిత్యాల: బాధ్యతాయుత పదవిలో ఉన్న మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ఓ మహిళా అధికారిణి పట్ల మాట్లాడిన అసభ్య పదజాలంతో యావత్ తెలంగాణా ప్రజలు నివేర్ర పోయారని, ఇలాంటి మంత్రిని వెంటనే పదవి నుంచి బర్తరఫ్ చేయాలని తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు పసుల రామ్మూర్తి డిమాండ్ చేశారు. సోమవారం జగిత్యాల జిల్లా కేంద్రంలో జిల్లా అధ్యక్షులు చిత్తారి ప్రభాకర్ అధ్యక్షతన కార్యకర్తల సమావేశం నిర్వహించగా రాష్ట్ర అధ్యక్షులు రామ్మూర్తి ముఖ్య అతిధిగా హాజరయ్యారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు, దళితులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తూన్నామని, ఇటీవలే ఓ మహిళా ఎంపిడిఓ పట్ల మంత్రి దయాకర్ రావు మాట్లాడిన తీరు యావత్ మహిళలను బాధించిందని అన్నారు. ఇలాంటి మంత్రిని వెంటనే బర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. టాస్త్ర ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న దళిత సాధికారత పథకం ఒక పచ్చి మోసం అని ఇదివరకే దళితులకు మూడేకరాల భూమి ఇస్తామని చెప్పిన కేసీఆర్ ప్రభుత్వం మోసం చేసిందని, 3 ఎకరాలకంటే 10 లక్షల నగదు గొప్పది కాదన్నారు. స్వరాష్ట్రం ఏర్పడినా నిరుద్యోగ సమస్య తీరడం లేదని నిరుద్యోగ సమస్యను తొలగించాలంటే వెంటనే బ్యాక్ లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలోనే భాగంగా తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర సలహదారుడిగా బొల్లం విజయను, రాష్ట్ర ఉపాధ్యక్షులు గా మద్దెల నారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి గా గిద్దె శంకరయ్య, మండల యూత్ అధ్యక్షులు గా బొల్లం వంశీని నియమిస్తూ రామ్మూర్తి ఉత్తర్వులను జారీచేశారు. ఇందులో రాష్ట్ర కార్యదర్శి వేల్పుల ప్రవీణ్, జిల్లా మహిళా అధ్యక్షురాలు దాసం రాణి,కార్యదర్శి వేల్పుల ప్రవీణ్ జిల్లా మహిళా అధ్యక్షురాలు దాసం రాణి, జిల్లా యూత్ అధ్యక్షులు నర్ర రాజేందర్, జిల్లా ఉపాధ్యక్షులు నర్రా రాజు మ్యాకల లక్ష్మణ్, గొల్లపల్లి మండల అధ్యక్షులు నక్క స్వామి, జగిత్యాల మండల గౌరవ అధ్యక్షులు సామెల్, మండల అధ్యక్షులు జక్కుల దేవయ్య, రఘు, శివ, సంజయ్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here