తెలంగాణాలో మద్య నిషేధం విధించాలి:మహిళా సంక్షేమ సమితి జిల్లా అధ్యక్షురాలు తాటిపర్తి శోభారాణి డిమాండ్

0
3

-అత్యాచార నిందితులను కఠినంగా శిక్షించాలి

-మహిళలకు రక్షణ కల్పించాలి

జగిత్యాల తాజా కబురు:రాష్ట్రంలో ఎరులైపారుతూ, అన్నీ అనర్థలాకు దారితిస్తున్న మధ్యాన్ని రాష్ట్రంలో నిషేదించాలని మహిళా సంక్షేమ సమితి జగిత్యాల జిల్లా అధ్యక్షురాలు, పెగడపల్లి మండలం బతికేపల్లి సర్పంచ్ తాటిపర్తి శోభారాణి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
మహిళలు, మైనర్ బాలికలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టాలని, గ్రామాల్లో బెల్ట్ షాపులను ముసివేయాలని, మహిళలకు రక్షణ కల్పించాలని, రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధం విధించాలని, అత్యాచార నిందితులను కఠినంగా శిక్షించాలని, గుట్కా, గంజాయి,ఇతర మత్తు పద్దర్తాలను అరికట్టి యువతను కాపాడాలని డిమాండ్ చేస్తూ
జగిత్యాల జిల్లా కేంద్రంలో తాటిపర్తి శోభారాణి ఆధ్వర్యంలో మహిళలు జమ్మిగద్దే నుంచి గొల్లపల్లి రోడ్డు, పాత బస్టాండ్ మీదుగా తహశీల్ చౌరస్తా వద్దకు ప్లకార్డ్స్ తో ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రన్ని జగిత్యాల ఆర్డీఓ మాధురికి అందజేశారు.ఈ సందర్బంగా శోభారాణి మాట్లాడుతూ బంగారు తెలంగాణ సాధించుకుందామని చెప్పి ఓట్లు వేయించుకొని మధ్యాన్ని రాష్ట్రంలో ఎరులై పారిస్తూ పేద కుటుంబాలను మధ్యానికి బానిసలుగా చేసి వారిని రోడ్డున పడేశాడని ఆరోపించారు.గ్రామాల్లో ఉదయం 5 గంటలనుంచి అర్ధరాత్రి వరకు బెల్ట్ షాపుల ద్వారా మద్యం అమ్మకాలు జరుగుతుందండంతో గ్రామాలు మత్తులో జోగుతున్నాయని దీంతో అసాంఘిక కార్యకలాపాలు పెరిగిపోతున్నాయని అలాగే మహిళలకు, మైనర్ బాలికలకు రక్షణ లేకుండాపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు, హత్యలు పెరిగిపోయాయని, అలాగే అభం శుభం తెలియని మైనర్ బాలికలను అత్యాచారం చేసి హత్యచేసిన సంఘటనల పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహారించాలని నిందితులను ఉరితీయాలని శోభారాణి డిమాండ్ చేశారు.నిషేదిత గుట్కా, గంజాయి మాదక ధ్రవ్యాల అమ్మకాలను అరికట్టి యువత వాటిబారిన పడకుండా చూడాలిసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి పనికల్పించాలని ముఖ్య మంత్రి కేసీఆర్ ను కోరారు.తక్షణమే గ్రామాల్లో బెల్ట్ షాపులు ముసివేయాలని పునరుద్గటించారు.అత్యాచార సంఘటనలు పునరావృతం కాకుండా చూసి మహిళాలోకానికి రక్షణ కల్పించాలని శోభారాణి, ఇందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు.కార్యక్రమంలో మద్దెల కృప, జూపాక లక్ష్మి, అమ్మాయి, అమృత, కనుకవ్వ, మణెమ్మ, బుచ్చిరాజవ్వ, బెక్కేo లక్ష్మి, సుగుణ, కిష్టవ్వ, సుజాత, నర్సవ్వ, రాజవ్వ, బొమ్మేన లక్ష్మి, తో పాటు పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here