జీవన నైపుణ్యాలు,నైతిక విలువల పై అవగాహణ

0
69


-యువత ఆదర్శంగా ఉండాలి: జగిత్యాల జిల్లా స్కిల్ కమిటీ సభ్యులు నాగిరెడ్డి రఘుపతి

జగిత్యాల తాజా కబురు:జగిత్యాల జిల్లా రాయికల్ మండల కేంద్రంలోని చిన్న జీయర్ స్వామి ట్రస్ట్ భవనంలో జిఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ అధ్వర్యంలో టైలరింగ్,ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్, బైక్ మెకానిక్ కోర్సుల్లో శిక్షణ పొందుతున్న నిరుద్యోగ యువతీ యువకులకు బుధవారం అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం సంధర్బంగా వ్యక్తిత్వ వికాస నిపుణులు ఎర్ర గంగరాజు,ఐ కేర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు,జిల్లా స్కిల్ కమిటీ సభ్యులు,ప్రతిమ ఫౌండేషన్ ఆర్గనైజర్ నాగిరెడ్డి రఘుపతి రెడ్డి జీవన నైపుణ్యాలు,నైతిక విలువల పై అవగాహణ కల్పించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ యువత ఆదర్శాన్ని అంటిపెట్టుకొని ఉండాలని అన్నారు.తల్లి దండ్రుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా, ఏకాగ్రతతో శిక్షణను సద్వినియోగం చేసుకొని ఉపాధి పొంధి నిరుద్యోగులకు ఆదర్శంగా తయారవ్వాలని అన్నారు.అనంతరం జిఎంఆర్ సంస్థ ప్రిన్సిపాల్ పి.రమేష్ కుమార్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతీ,యువకులు అక్షరాస్యత దిశగా అడుగులువేస్తూ, ఉపాధి శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు హరి ప్రసాద్,శ్రీకాంత్, విజయలక్ష్మి,సహాయకులు శేఖర్,విద్యార్థులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here