ప్రతిపక్షం లేని పార్టీగా తె.రా.స పావులు కదుపుతోందా…? జగిత్యాలలో భా.జ.పా బలహీనమౌతోందా…?

0
97

జగిత్యాల తాజా కబురు: రెండున్నర సంవత్సరాల్లో అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపత్యంలో అన్ని సిగ్మెంట్లలో గెలుపు కోసం తెరాస ఇప్పటినుండే పావులు కదుపుతూ ఆకర్షించే ఆఫర్లను నాయకుల ముందు పెడుతూ, ఏ పార్టీ నాయకులైన సరే తమ వైపుకు తిప్పుకునే కసరత్తులు ప్రారంభించినట్లు తెలుస్తుంది.తాజాగా తెలుగు దేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎల్ రమణ శుక్రవారం సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తె.రా.సలో సభ్యత్వం తీసుకోగా ఆయన అనుచరులతో పాటు జగిత్యాల జిల్లాలోని టిడిపి పార్టీలోని పలు మండలాల అధ్యక్షులు టిడిపికి రాజీనామా చేసి టిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.కాగా జగిత్యాల జిల్లాలో గత కొన్ని రోజుల క్రితమే ఎంపీ ధర్మపురి అరవింద్ ఆధ్వర్యంలో జగిత్యాల వ్యాపారవేత్త గుడాల రాజేష్ టిడిపి నుండి బీజీపీలో చేరగా జిల్లా ఉపాధ్యక్షులుగా నియమించారు. ఊహించని విధంగా భాజపా ను వీడి శుక్రవారం కేసీఆర్ చేతుల మీదుగా టిఆర్ఎస్ కండువా కప్పుకున్నారు.బీర్పూర్ మండల భాజపా అధ్యక్షులు శ్రీపతి రమేష్ కుడా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో భాజపాను వీడి తెరాస లో చేరారు.రానున్న ఎన్నికలకు ఇప్పటినుండే తెరాస పార్టీ పావులు కదుపుతుందనడానికి ఆనవాళ్లుగా చెప్పుకోవచ్చు.అయితే రాజకీయం అన్నాక పార్టీలు మారడం పదవులు పొందడం సహజమే అని విశ్లేసకులు చెబుతున్న ప్రతిపక్షం లేని పార్టీగా అవతరించాలంటే మాత్రం కష్టమే అంటున్నారు.
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో తెరాస కు పోటీలో ఉండేది బీజేపీ మాత్రమే అని జీహెచ్ఎంసి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో గట్టి పోటీని ఇచ్చింది కూడా భాజపానే కాబట్టి భాజపా అభ్యర్థులను బుట్టలో వేసుకుని అన్ని సిగ్మెంట్ల పరిధిలో ఓటింగ్ శాతాన్ని పెంచుకోవడమే లక్ష్యంగా తెరాస ముందుకు సాగుతుందనుకోవచ్చు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
జగిత్యాలలో భా.జ.పా బలహీనమౌతోందా…?
బీర్పూర్ మండల భాజపా అధ్యక్షులు,జగిత్యాల జిల్లా ఉపాధ్యక్షులు వారి అనుచరులు భాజపాను వీడి తెరాసలో చేరడంతో జిల్లా భాజపా శాఖ బలహీనమవుతుందా…? మేల్కోనుందా…? లేక రాష్ట్ర స్థాయి భా.జ.పా రంగంలోకి దిగనుందా…? ఇద్దరే కదా పోతే పోనీ అనుకోనుందా..? బండి సంజయ్ పాద యాత్ర తరువాత రాష్ట్ర స్థాయిలో భా.జ.పా బలపడనుందా..? అధికారంలోకి భా.జ.పా రానుందా…? ప్రతిపక్షంలో భా.జ.పా ఉండనుందా..? అంటే ఎన్నికలకు ముందే చెప్పలేము కదా ఒక్క రోజులో ఫలితాలు తారుమారు కావచ్చంటున్నారు ఓటర్లు. ఏది ఏమైనా ప్రస్తుతం జగిత్యాల జిల్లా భా.జ.పా నాయకత్వం పై ఆ పార్టీ కార్యకర్తలు కొందరు అసంతృప్తి ని వ్యక్తం చేస్తున్నారు.ఇలాగే కొనసాగితే పరిస్థితి ఏమిటని సామజిక మాధ్యమాల్లో ప్రశ్నించుకుంటున్నారు కొందరు భాజపా కార్యకర్తలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here