జగిత్యాలలో బీజేపీ వెనుకంజ…? కార్యకర్తలు ఉన్నా సరైన లీడర్ లేకేనా…?

0
122

తాజా కబురు జగిత్యాల: ఏ పార్టీకైనా రాజకీయంగా ఎదగాలంటే కార్యకర్తలదే ప్రముఖ స్థానం. జగిత్యాల జిల్లా లో గ్రామస్థాయిలో బీజేపీకి మంచి పట్టు ఉన్న కార్యకర్తలు ఉన్నప్పటికీ గ్రామ స్థాయి, బూత్ కమిటీల ఏర్పాట్లు చేయకపోవడంతో ఆ పార్టీ కార్యకర్తలలో నైరాశ్యం మొదలవుతుందని,పార్టీ నాయకుల ఆదేశాలు లేకుండా జిల్లా లో వివిధ మోర్చాల నాయకులకు ఇప్పటివరకు పూర్తి బాధ్యతలు అప్పగించక పోవడంతోనే నేటికీ కొన్ని మండలలా స్థాయిలో నాయకులున్న గ్రామ స్థాయిలో మాత్రం బూత్ కమిటీల ఏర్పాటు జరగడం లేదని సమాచారం. 2023 లో జరిగే ఎన్నికలకు ఇప్పటినుండే పలు రాజకీయ పార్టీలు సన్నద్ధం అవుతున్న తరుణంలో,భాజపా రాష్ట్ర స్థాయి నాయకులకు మాత్రం కనువిప్పు కలగడం లేదని, గతంలో జిల్లాలో సరియగు నాయకత్వం లేకే ఎన్నికల బరిలో భాజపా అభ్యర్థులు ఓటమి పాలు అవుతున్నారని అదే పార్టీకి చెందిన పలువురు కార్యకర్తలు చర్చించుకుంటున్నారు.వచ్చే ఎన్నికల్లో అయినా వాక్చాతుర్యం, అంచనాలకు మించిన ఎత్తుగడలు, కార్యకర్తలకు అను నిత్యం అందుబాటులో ఉండి గ్రామ స్థాయిలో సమస్యల పరిష్కరానికి కృషి చేసే ఓ మంచి నాయకున్ని భా.జ.పా ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించాలని ఇప్పటికే ఆ పార్టీ బడా నాయకులకు కార్యకర్తలు విన్నవించినట్లు సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here