ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిని క్షేత్ర స్థాయిలో సందర్శించిన :కలెక్టర్ కృష్ణ భాస్కర్

0
10

తాజా కబురు వేములవాడ: వేములవాడ ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో పిడియాట్రిక్ వైద్య సేవలు అందించ డం కోసం తగిన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ ను ఆదేశించారు.మంగళవారం కలెక్టర్ వేములవాడ పట్టణం తిప్పాపూర్ లోని ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిని క్షేత్ర స్థాయిలో సందర్శించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చిన్న పిల్లలకు వైద్య సేవలు అందించడం కోసం అవసరమైన ఏ ర్పాట్లు త్వరితగతిన చేసేలా చూడాలని ఆదేశించారు.50 పడకలు పిడియాట్రిక్ సేవలు అందించేందుకు కేటాయించాలని సూ చించారు.అందులో 20 పడకలు ఐసీయూ,మిగతా 30 పడకలు జనరల్ కు కేటాయించాలని కలెక్టర్ ఆదేశించారు. నిర్మాణ ప్రగతిలో ఉన్న ఆక్సిజన్ ట్యాంకు,ఆక్సిజన్ జనరేషన్ ట్యాంకు నిర్మాణ పురోగతిని కలెక్టర్ అడిగి తెలుసుకు న్నారు.వీలైనంత త్వరగా వాటి నిర్మాణాలు పూర్తి చేసేలా చూడాలని ఆదేశించారు.ఈ సందర్శనలో కలెక్టర్ వెంట సూ పరింటెండెంట్ డా.మహేష్ రావు,తదితరులు ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here