దొంగతనం కేసులో నిందితుడి అరెస్ట్ 9 తులాల బంగారు ఆభరణాలు రికవరీ

0
17

జగిత్యాల తాజాకబురు : కోరుట్ల పట్టణంలో గత నెల రోజుల క్రితం జరిగిన దొంగతనం కేసులో నిందితుడిని అరెస్ట్ చేసి 9 తులాల బంగారు ఆభరణాలు రికవరీ చేసినట్లు సి.ఐ రాజశేఖర రాజు మంగళవారం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో తెలిపారు. గత నెల 24 వ తేదీన తాళం వేసిన ఓ ఇంట్లో చోరీ జరగగా కోరుట్ల పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు సాగించారు. ఈ క్రమంలో పోలీసువారికి లభించిన కొన్ని క్లూస్ ను ఆధారం చేసుకుని మంగళవారం ఉదయం కోరుట్ల పోలీసులు దొంగతనం చేసిన నిందితుడిని అతని ఇంటి వద్ద అరెస్టు చేసి అతని వద్ద దొంగిలించిన సొమ్మును (9) తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకుని నిందితుడి కస్టడీలోకి తీసుకున్నారు. ఈ కేసు విచారణలో, లభించిన స్వల్ప ఆధారాలతో నిందితుడిని చాకచక్యంగా పట్టుకున్న కోరుట్ల ఎస్ఐ రాజప్రమీల,సతీష్ లను సీఐ రాజశేఖర రాజు అభినందీస్తూ వారికీ రివార్డుల నిమిత్తం పై అధికారులకు నివేదిక ఇస్తామని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here