డిమాండ్ల సాధనకై సమ్మెకు పోతున్నాం :ఏ. ఐ.టి.యు.సి జగిత్యాల జిల్లా అధ్యక్షురాలు కె.సరస్వతి

0
11


-జిల్లా విద్యాశాఖాధికారికి నోటీస్ ఇచ్చిన మధ్యాహ్న భోజన కార్మికులు

జగిత్యాల తాజా కబురు: ఐక్య కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు సెప్టెంబర్ 24 నుంచి అఖిల భారత సమ్మెలో పాల్గొంటున్నామని తెలంగాణ మధ్యాహ్న భోజన పతకం వర్కర్స్ యూనియన్ (ఏ. ఐ.టి.యు.సి) జగిత్యాల జిల్లా అధ్యక్షురాలు కె.సరస్వతి తెలిపారు. శనివారం జగిత్యాల జిల్లా విద్యాశాఖ అధికారికి సమ్మె నోటీస్ ఇచ్చిన అనంతరం జగిత్యాల ప్రెస్ క్లబ్ లో ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ డిమాండ్లపై ప్రపంచ ఆరోగ్య సంస్థ నియమావళిని రూపొందించిదన్నారు. అమలుకు నోచుకోని తమ డిమాండ్ల సాధనకై దేశ వ్యాప్తంగా కార్మిక సంఘాలు ఐక్యమై కేంద్ర కార్మిక సంఘాల సారథ్యంలో ఈ నెల 24 నుంచి అఖిల భారత సమ్మెకు పిలుపునిచ్చారని తెలిపారు. కార్మికుల డిమాండ్లతో పాటు భోజన పతకంలోని కార్మికుల సమస్యలపై సమ్మె నోటీస్ ఇచ్చామన్నారు. పెండింగులో ఉన్న వంట కార్మికుల కనీస వేతనాలు, ప్రతినెలా 5 లోపు మెస్ బిల్లుల చెల్లింపు, మెస్ ఛార్జ్ 15 వేల డిమాండ్, రాయితీ గ్యాస్ సరఫరా, కోడిగుడ్ల కై ప్రత్యేక బడ్జెట్, వంట కార్మికులకు గుర్తింపు నిచ్చి స్కీమ్ వర్కర్లుగా గుర్తింపు, ప్రమాద బీమా, పని భద్రత, పి.ఎఫ్ సౌకర్యం, ప్రతి బడిలో వంటగది ఏర్పాటు, స్వచ్ఛంద సంస్థలకు భోజన సరఫరా అప్పగింత నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, మరికొన్ని డిమాండ్లతో సమ్మెలోకి పోతున్నామని జిల్లా అధ్యక్షురాలు సరస్వతి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎండి.ముక్రం, అల్తాఫ్, వెన్న సురేష్, రామక్క, కిరణ్, హన్మంతుతోపాటు పలువురు ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here