దాడులకు వ్యతిరేకంగా జర్నలిస్టుల రాస్తారోకో

0
13

తాజా కబురు డెస్క్: పెద్దపల్లిలో రాజీవ్ రహదారిపై రాస్తారోకో జర్నలిస్టులపై జరుగుతున్న దాడు లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అరికట్టాలని పెద్దపల్లి ప్రెస్ అధ్యక్ష,కార్యదర్శులు చింతకింది చంద్రమొగిలి,నారాయణ దాస్ అశోక్ డిమాండ్ చేశారు.ఇటీవల హుజూర్ నగర్లో టీవీ చానల్ జర్నలిస్టులపై దాడికి నిరసనగా సోమవారం ఆందోళన నిర్వహించారు.తెలంగాణ అమరవీరుల స్థూ పం వద్ద నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు.అక్కడి నుండి బస్టాండ్ అంబెడ్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. రాజీవ్ రహదారిపై రాస్తారోకో చేశారు. అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. అనంతరం మాట్లాడుతూ జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక చట్టం రూపొందించాలని కోరారు.జర్నలిస్టులపై దాడి ని తీవ్రంగా ఖండించారు.రాజీవ్ రహదారిపై వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ అంతరాయం ఎర్పడడంతో సమాచార మం దుకున్న ట్రాఫిక్ ఎస్సై ఇసాక్ హైమద్ సంఘటనా స్థలానికి చేరుకొని జర్నలిస్టుల ధర్నాను విరమింప జేశారు.
ఈ నిరసన కార్యక్రమంలో జనగామ నిరంజన్,బాలసాని రాజయ్య,కుమ్మరి ముకేష్,బర్ల రమేష్ బాబు,శివాచారి,గౌస్ పాషా,పులిపాక రామకృష్ణ,ఆకుల రమేష్,పవన్,బోనాల నాగరాజు,అడిచర్ల రమేష్,పోగుల విజయ్,ఆరెల్లి మల్లేశ్,కొమిశెట్టి శ్రీనీవాస్,సాబీర్ పాషా,బాలాజీ సింగ్,వెన్నంపల్లి శ్రీనీవాస్,కలవేణ రాజేందర్,వీరమల్ల విద్యాసాగర్ రావు తదితరులు పాల్గోన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here