D2కెనాల్ నూతన సర్వేను రద్దు చేయలని రైతుల విజ్ఞప్తి.

0
23

రాజన్న సిరిసిల్ల తాజా కబురు:రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలకేంద్రంలో D2కెనాల్ నూతన సర్వేను రద్దు చేయలని ఇల్లంతకుంట , వెంకట్రావు పల్లే ,గోల్లపల్లి , గ్రామలకు చెందిన పేద దళిత , చిన్నకారు‌, సన్నకారు రైతులు ప్రభుత్వంనకు విజ్ఞప్తి చేశారు.ఇల్లంతకుంట మండల కేంద్రంనకు చెందిన పేద ,చిన్న ,సన్న కారు దళిత రైతుల భూముల గూండా నూతన సర్వే ను రద్దు చేసి గతంలో ప్రభుత్వ అనుమతి వచ్చిన పాత అలైన్ మెంట్ ద్వారా లేదా తిమ్మాయి చెరువు మీదుగా జంగారెడ్డి పల్లి గుడి ఓర్రే మీదుగా ఇల్లంతకుంట మత్తడి నుండి గా‌లిపెల్లి గ్రావిటీ కాలువ ద్వారా గాలి పెల్లి చింతల చెరువుకు తరలించడం ద్వారా సూమారు భూగర్భ జాలలు పెరిగి 12గ్రామలలో 10వేల ఏకారలు సాగులోకి వచ్చే అవకాశం ఉంది.గతంలో ఇల్లంతకుంట గ్రామనికి చెందిన పేద దళిత చిన్న కారు ,సన్న కారు రైతులు ఇల్లంతకుంట మండల రైతుల కోసం 10కోట్ల విలువైన భూమిని మండల వ్యవసాయ మార్కెట్ కోసం ,మరియు మండల దళితుల కోసం అరుంధతి కళ్యాణమండపం కోసం భూమిని ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం 4వరుసల రహదారి కోసం సిద్దిపేట నుండి ఇల్లంతకుంట వరకు నిర్మించే రహదారి లో కూడ దళితులే భూమిని కోల్పోవడం జరుగుతుంది.1లేదా 2ఏకారల వ్వవసాయ భూములు ఉన్న దళితుల భూముల గుండా కెనాల్ అలైన్ మెంట్ చేస్తే వారి కుటుంబాలు రోడ్డున పడి అత్మహత్య లు చేసుకోనే పరిస్థితులు ఏర్పాడుతాయి. కాదని ఇల్లంతకుంట దళితుల భూముల గుండాసర్వే చేయాలని చూస్తే ఇల్లంతకుంట గ్రామ దళిత రైతుల ఆత్మహత్యలకు ప్రభుత్వ ప్రజాప్రతినిధులు ,ప్రభుత్వ అధికారులే బాధ్యత వహించలసి వస్తుందని ప్రభుత్వంన కు విజ్ఞప్తి చేస్తు స్థానిక మానుకోండూర్ శాసన సభ్యులు రసమయి బాలకిషన్ కి మరియు మండల ప్రజాప్రతినిధులు, జిల్లా ప్రజాప్రతినిధులు ఇట్టి కెనాల్ అలైన్ మెంట్ పాత అలైన్ మెంట్ ద్వారా చేయాలని విజ్ఞప్తి చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో గొడుగు నర్సయ్య, గొడుగు తిరుపతి, ఎం.రాజు, మామిడి ఆంజనేయులు, కొట్టే వెంకన్న, మామిడి మల్లికార్జున్, మహేందర్, మామిడి రాజు, రాజెల్లమ్ మరియు రైతులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here