cricket betting (క్రికెట్ బెట్టింగ్ నిర్వ‌హిస్తున్న వ్య‌క్తులు అరెస్ట్)

0
543

కాయ్ రాజ ….కాయ్‌…..
టాస్క్‌పోర్స్ కు చిక్కిన బెట్టింగ్ నిర్వ‌హిస్తున్న మూఠా…
కరీంనగర్ కేంద్రంగా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న
శ్ర‌మించి ప‌ట్టుకున్న అధికారులు….

గత కొద్ది నెలలుగా కరీంనగర్ పట్టణ కేంద్రంగా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న 8మంది సభ్యులు గల ముఠాలో,7గురిని అరెస్ట్ చేసిన టాస్క్ ఫోర్స్ ,వారి వద్ద నుండి 11 మొబైల్స్,45500/- రూపాయల నగదును స్వాదినం చేసుకొని,రిమాండ్ కు తరలించారు..

బెట్టింగ్ నిర్వహించే విధానం

ప్రపంచ క్రికెట్ జట్ల మధ్య వన్ డే మ్యాచ్ లు,టెస్ట్ మ్యాచ్ లు,టి 20 మ్యాచ్ లు,ఐపీఎల్ వంటి క్రికెట్ మ్యాచ్ లు ఉన్న సమయం లో కరీంనగర్ లోని కాపువాడ కు చెందిన మహమ్మద్ సరాజ్, బొమ్మరాతి సంతోష్, వావిలాలపల్లి కి చెందిన రాచకొండ సురేష్, అశోక్ నగర్ కు చెందిన ఠాకూర్ జగదీష్, కందుకూరి సంతోష్, దేవరకొండ రాహుల్, పద్మనగర్ కు చెందిన నునుగొండ సాయి ప్రసాద్,భగత్ నగర్ కు చెందిన గంగిపల్లి సాయి కృష్ణ లు ఒక ముఠా గా ఏర్పడి ఎలాగైనా క్రికెట్ బెట్టింగ్ నిర్వహించి,వాటి ద్వారా లాభాలను గడించాలనే ఉద్దేశంతో,ఆన్లైన్ లో క్రికెట్ బెట్టింగ్ కు సంబందించిన వెబ్ సైట్ లను గమనిస్తూ,వాటిలో ఏ విదంగా బెట్టింగ్ నిర్వహించాలని,ఎలా లాభాలు పొందాలని గమనించి,వాటిని ఆసరాగా చేసుకుని,వాటితో ఒక అంచనకు వచ్చి,ఏ టీం పై ఎంత బెట్టింగ్ పెడితే,ఎంత పర్సన్టేజ్ లో లాభం ఇవ్వాలో ఫిక్స్ చేసుకొని,ఒక ప్రదేశాన్ని ఎంచుకొని,అక్కడి నుంచి క్రికెట్ చూస్తూ,సామాజిక మాధ్యమాలతో పాటు,ముఖ్యముగా వాట్సాప్ ను ఉపయోగిస్తూ,దాని ద్వారా అందరికి క్రికెట్ బెట్టింగ్ గురించి సమాచారం పంపుతూ,తద్వారా వారి వద్ద నుండి వాట్సాప్ లొనే ఏ టీం పై బెట్టింగ్ పెడతారో తెలుసుకొని,ఏ టీం గెలిస్తే వారికి ఎంత లాభం వస్తదో వారికి తెలియజేస్తూ, వారి వద్ద నుండి పర్సన్టేజ్ ప్రకారం డబ్బులు స్వీకరిస్తూ,మ్యాచ్ అనంతరం వారి వారి నిష్పత్తిలో వచ్చిన లాభాలను పంచుతూ,వీరు లాభాలు పొందుతూ బెట్టింగ్ ను గత కొన్ని నెలలుగా నిర్వహిస్తున్నారు….ఇట్టి బెట్టింగ్ లో ఎక్కువగా యువకులు,విద్యార్థులు పాల్గొనటం జరుగుతుంది…

చాక‌చ‌క్యంగా ….. టాస్క్‌

గత కొద్ది రోజులుగా కరీంనగర్ పట్టణ కేంద్రంగా క్రికెట్ మ్యాచ్ లు ఉన్న సమయం లో భారీ ఎత్తున బెట్టింగ్ నిర్వహిస్తున్నారన్న సమాచారం మేరకు, అనుమానితుల యొక్క వివరాలను సేకరించిన టాస్క్ ఫోర్స్ వారి పై నిఘా ఉంచగా,ఇటీవల జరిగిన ఇండియా-శ్రీలంక కు సంబందించిన మ్యాచ్ పై కూడా భారీగా బెట్టింగ్ నడిచినదని తెలుసుకొని, మ్యాచ్ అనంతరం నిన్న సాయంత్రం భారీ మొత్తంలో *డబ్బులు చేతులు మారుతుండగా*,టాస్క్ ఫోర్స్ పక్క ప్రణాళిక ప్రకారం దాడులు నిర్వహించి,ఎట్టకేలకు బెట్టింగ్ నిర్వహిస్తున్న కరీంనగర్ పట్టణానికి చెందిన 8 మంది సభ్యులు గల ముఠాను వల పన్ని పట్టుకోవడం జరిగింది..అందులో 7గురు వ్యక్తులను అదుపులోకి తీసుకోగా,మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు…వారి వద్ద నుండి 45,500/- రూపాయల నగదుతో పాటు,బెట్టింగ్ కోసం ఉపయోగిస్తున్న పదకొండు మొబైల్ ఫోన్స్ ని స్వాదినం చేసుకోవడం జరిగింది…

ఆన్లైన్ వెబ్ సైట్ లను గమనిస్తూ.

క్రికెట్ మ్యాచ్ లు ఉన్న సమయంలో ఈ ముఠాకి చెందిన సభ్యులు ఆన్లైన్ లో క్రికెట్ బెట్టింగ్ గురించి Sportsnet.co.au మరియు betfair.com.au అను వెబ్ సైట్లను గమనిస్తూ, వాటి ద్వారా ఎంత వరకు బెట్ కట్టవచ్చొ ,తద్వారా ఎంత వరకు లాభాలు వస్తాయో ఒక అంచనకు వస్తూ, భారీ ఎత్తులో బెట్టింగ్ ను నిర్వహిస్తున్నారు…

*వాట్సాప్ ను ఉపయోగిస్తూ..బెట్టింగ్ ని వైరల్ చేస్తూ…*

క్రికెట్ మ్యాచ్ లు జరుగుతున్న సమయం లో బెట్టింగ్ నిర్వహించే వీళ్ళు,ఒక దగ్గర కూర్చొని సామాజిక మాధ్యమాలతో పాటు,వాట్సాప్ ను ఉపయోగిస్తూ,వాట్సాప్ ద్వారా బెట్టింగ్ పెట్టు అమౌంట్ ను అందరి దగ్గర నుండి స్వీకరిస్తూ,వాటిని ఒక బుక్ లో రాసుకుంటూ,వాట్సాప్ ద్వారా అందరికి ఎప్పటికప్పుడు బెట్టింగ్ పెట్టు అమౌంట్ పర్సన్టేజ్ లలో ,ఏ టీం పై బెట్టింగ్ పెడితే ఎంత లాభం వస్తుందో ప్రచారం చేస్తూ,అధిక మొత్తంలో బెట్టింగ్ నిర్వహిస్తూ ,తద్వారా లాభాలు గడిస్తూ ఉన్నారు…మ్యాచ్ అనంతరం బెట్టింగ్ పెట్టిన వాళ్లకు వారి వారి బెట్టింగ్ పర్సన్టేజ్ ప్రకారం చెల్లిస్తూ,అందులో నిర్వాహకులు పర్సన్టేజ్ గా లాభాలు పొందుతున్నారు….

*క్రికెట్ బెట్టింగ్…అధిక మొత్తంలో యువత..*

కరీంనగర్ పట్టణం మరియు పరిసర ప్రాంతాలలో క్రికెట్ మ్యాచ్ లు జరుగు సమయంలో బెట్టింగ్ నిర్వహణ జరుగుతున్నదని,ఇందులో అధిక సంఖ్యలో యువకులు,విద్యార్థులు బెట్టింగ్ ఆడుతున్నారని,తద్వారా బెట్టింగ్ కి బానిసలుగా మారి,లాభాలు వస్తాయనే ఆలోచనతో పేడ త్రోవ పడుతున్నారని,లక్షల్లాల్లో బెట్టింగ్ జరుగుతున్నదని తెలిసింది…ముఖ్యముగా ఇండియా మ్యాచ్ లలో ఎక్కువ బెట్టింగ్ ఉంటుందని, వాటితో పాటు ఇతర దేశాల మ్యాచ్ లో ఉన్నప్పుడు కూడా బెట్టింగ్ నడుస్తున్నదని తెలిసింది…

*క్రికెట్ బెట్టింగ్కు పాల్పడితే కఠిన చర్యలు…టాస్క్ ఫోర్స్ సిఐ శ్రీనివాసరావు:*

ప్రపంచ క్రికెట్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ లు జరిగే సందర్భాలలో ,కరీంనగర్ పట్టణ కేంద్రంగా చాలా మంది బెట్టింగ్ కి పాల్పుడుతున్నారని,బెట్టింగ్ నిర్వహించే వారి వివరాలు సేకరించామని,ఇప్పటికైనా ఇలాంటి బెట్టింగ్ లు మానుకోవాలని,లేకుంటే వారి పై దాడులు నిర్వహించి,చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ హెచ్చరించారు…తల్లిదండ్రులు ఇలాంటి బెట్టింగ్ లకు పాల్పడే విద్యార్థుల పట్ల,యువత పట్ల శ్రద్ధ తీసుకోవాలని,యువకులు బెట్టింగ్ కి పాల్పడి కేసుల బారిన పడి,వారి బంగారు భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని తెలిపారు…

*స్వాదినం చేసుకున్న సొత్తు ::*

1.పదకొండు మొబైల్ ఫోన్స్..
2.45,500/- రూపాయల నగదు…

నిందితులను పట్టుకోవడం లో శ్రమించిన పోలీసులు

1.ఎస్. శ్రీనివాసరావు, సిఐ,టాస్క్ ఫోర్స్…
2.ఈ. కిరణ్,ఎస్సై,టాస్క్ ఫోర్స్..
3.బి.సంతోష్,ఎస్సై,టాస్క్ ఫోర్స్..
4.పి.నాగరాజు,ఎస్సై,టాస్క్ ఫోర్స్…

మరియు టాస్క్ ఫోర్స్ సిబ్బంది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here