బీ.జే.పీ వల్ల బీర్పూర్ మండల అభివృద్ధి శూన్యం- ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్

0
44

తాజా కబురు జగిత్యాల:జగిత్యాల జిల్లా బీర్పూర్ మండల కోమన్ పల్లి గ్రామ సర్పంచ్, బీ.జే.పీ పార్టీ మండల అధ్యక్షుడు శ్రీపతి రమేష్ ను గురువారం తె.రా.స కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ టీఆరెస్ పార్టీ సభ్యత్వాన్ని అందజేసిన ఎమ్మెల్యే.అనంతరం మాట్లాడుతూ శ్రీపతి రమేష్ మొదటి నుండి నాకు మంచి మిత్రుడని, గతంలోనే ఇద్దరం కలిసి ఇక్కడి పార్టీ లో కలిసి పని చేశామని, కొన్ని భిన్న అభిప్రాయాల వల్ల బీజేపీ లో చేరడం జరిగిందని, బీజేపీ వల్ల బీర్పూర్ మండల అభివృద్ధి కి జరిగింది శూన్యమని, రైతులకు, ఆసరా పెన్షన్, గ్రామాల అభివృద్ధి కై ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతరం పని చేస్తున్నారని, నియోజకవర్గ పరిధిలో 90 శాతం మంది ప్రజా ప్రతినిధులు టీఆరెస్ వైపే ఉన్నారని,ఎమ్మెల్సీ కవిత, మంత్రి కేటీఆర్,ఈశ్వర్ ల సహకారంతో జగిత్యాల అభివృద్ధి కృషి చేస్తున్నానని టీఆరెస్ పార్టీ లో కార్యకర్తల మధ్య ఒక కుటుంబ సభ్యుల అనుబంధం ఉంటుందని అన్నారు.గత ఎంపీ ఎన్నికల్లో బీజేపీ తప్పుడు ప్రచారాలతో రైతులను మోసం చేసి గెలిచిందని, బాండ్ పేపర్ నాటకం ఆడి, కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కు అయ్యారని కవిత ఓటమికి ప్రధాన కారణమని అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ లలో నూటికి 2 రూపాయలు మాత్రమే కేంద్రం ఇస్తుందని అసెంబ్లీ సాక్షిగా మంత్రి దయాకర్ రావు చెప్పారని అన్నారు.వ్యవసాయం లో ప్రపంచానికి ఆదర్శంగా రైతుల అభివృద్ధి కి కృషి చేస్తున్న ప్రభుత్వమని,బీడీపెన్షన్, ఒంటరి మహిళ, ఇలా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూనామని, ఆరోగ్య లక్ష్మీ ద్వారా కేంద్రం నెలకి 8 గుడ్లు ఇస్తే, తెలంగాణ ప్రభుత్వం 22 గుడ్లు అందజేస్తుందని అన్నారు, రొల్లవాగు ప్రాజెక్టు అభివృద్ధి కోసం, బీర్పూర్ మండల అభివృద్ధి కోసం పాటుబడుతున్న ప్రభుత్వమని ₹ 3.5 కోట్ల తో కాలువలు బాగు చేయటానికి, 2 కోట్లతో తాళ్ల ధర్మారంలో చెక్ డ్యామ్ నిర్మించుకున్నామని రైతులకు చాలా ఉపయోగకరమని అన్నారు.గతంలో చెరువుల ఆక్రమణ చేసారు, తప్ప రైతు గోస పట్టలేదని అన్నారు.శాంతి భద్రతల విషయంలో,మహిళల పట్ల,సంక్షేమం పట్ల,అన్ని మతాల పండుగలను అన్ని వర్గాలు అభివృద్ధి కి కృషిచేస్తున్న ప్రభుత్వం దేశంలో తెలంగాణ మాత్రమేనని అన్నారు.తెలంగాణ వచ్చిన తర్వాత జగిత్యాల ను జిల్లా కేంద్రంగా చేసుకున్నామని,రైతు బజార్ల,ఇంటిగ్రేటెడ్ మార్కెట్,పండ్ల మార్కెట్,మెడికల్ కాలేజ్,నూతన కలెక్టరేట్,జిల్లా పోలిస్ కార్యాలయం,మాతా శిశు కేంద్రం,డయాగ్నిస్టిక్ కేంద్రం,పార్కుల అభివృద్ధి,అమర వీరుల స్తూపం మరియు పార్క్, మినీ ట్యాంక్ బండ్ ఇలా అనేక కార్యక్రమాలు చేశామని అన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామాల అభివృద్ధి కి పల్లె ప్రగతి, వైకుంటాదామాలు,డంపింగ్ యార్డ్,పల్లె ప్రకృతి వనం,ఇలా పల్లెల అభివృద్ధి కి కృషి చేస్తున్న ప్రభుత్వ మని, ఎమ్మెల్యే నిధులు వచ్చిన వెంటనే బీర్పూర్ మండలానికి నిధుల విషయంలో ప్రాధాన్యం కల్పిస్తానని,దేశం,ధర్మం తో పాటు రాష్ట్ర అభివృద్ధి టీఆరెస్ తోనే సాద్యమని,ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజలకు చేరాలంటే నాయకుల పాత్ర చాలా కీలకమని అన్నారు.టీఆరెస్ ప్రభుత్వమే తెలంగాణ ప్రజలకి శ్రీరామ రక్ష అని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు నారపాక రమేష్, జిల్లా కెడిసిసి మెంబెర్ ముప్పాల రామచందర్ రావు, జిల్లా రైతు బంధు సమితి కన్వీనర్ కొలుముల రమణ, బీర్పూర్ సర్పంచుల ఫోరమ్ అధ్యక్షుడు మహిపాల్ రెడ్డి, మండల రైతు బంధు సమితి కన్వీనర్ మెరుగు రాజేశం, ప్రజాప్రతినిధులు,సర్పంచులు,ఎంపీటీసీలు,ఉప సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here