జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఆగని బీ.జే.పీ నిరసన ప్రదర్శనలు

0
24

-చెత్తను ఊడ్చారు నిరసన తెలిపారు

జగిత్యాల తాజా కబురు: బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అరెస్ట్ తో రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు రోజుకోరీతిలో నిరసనలు చేపట్టారు.బుధవారం రాష్ట్ర పార్టీ ఆదేశాలతో స్థానిక ఆర్డీవో కార్యాలయం ఎదుట బిజెపి నాయకులు చీపుర్లు పట్టి చెత్తను ఊడ్చి తమ నిరసనను వ్యక్తం చేశారు.ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.ఈ సందర్భంగా పలువురు భా.జ.పా నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నియంత పాలనను తలపిస్తోందన్నారు.ప్రజాసమస్యలపై ప్రశ్నించే హక్కును హరించి వేస్తోందని,ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకే బండి సంజయ్ ను అక్రమంగా అరెస్ట్ చేశారన్నారు.తప్పుడు కేసులు పెట్టి జైలుపాలు చేయాలని ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఉద్యోగుల బదిలీలకై తెచ్చిన జీ.ఓ.317 సవరణ చేయాలనే డిమాండ్ తో జన జాగరణ చేపడితే అన్యాయంగా అరెస్ట్ చేసారని,తప్పుడు కేసులతో పోరాటం ఆగదని వారు హెచ్చరించారు. రాష్ట్రంలో సైనిక పాలనను మరిపించేలా పోలీసు పాలన నడుస్తోందని వారన్నారు.ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాగిల్ల సత్యనారాయణ, చిలకమర్రి మదన్ మోహన్,పట్టణ ఉపాధ్యక్షులు ఠాకూర్ పవన్ సింగ్, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొక్కు గంగాధర్, మత్సశాఖ జిల్లా కన్వీనర్ జుంబర్తి దివాకర్, బైరి రాజేందర్, జిల్లా కార్యవర్గ సభ్యుడు రాపర్తి రాజు, బీజేవైఎం పట్టణ అధ్యక్షులు రవితేజ, దళితమోర్చా పట్టణ అధ్యక్షులు నక్క జీవన్, బీజేవైఎం పట్టణ ప్రధాన కార్యదర్శి ప్రేమసాగర్, ఉపాధ్యక్షులు నరేందర్, బీజేపీ సీనియర్ నాయకులు సిపెల్లి రవి, లింగంపేట శ్రీనివాస్, కిషోర్ సింగ్, శ్రీకాంత్ రావు తోపాటు పలువురు ఉన్నారు.

రాయికల్ లో… భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బండి సంజయ్ అరెస్ట్ కు నిరసనగా రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు భూపతిపూర్ గ్రామ సహకార సంఘం వద్ద బుధవారం స్వచ్ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించి పరిసరాలను శుభ్రం చేశారు.ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు గ్రామ ఉపసర్పంచ్ అన్నవేణి వేణు,సొసైటీ చైర్మన్ ఏనుగు ముత్యం రెడ్డి,ఎంపీ.టీ.సీ ఆకుల మహేష్,ప్రధాన కార్యదర్శి తిప్పిరెడ్డి రాజశేఖర్,గ్రామ శాఖ అధ్యక్షుడు సంకోజి శేఖర్,సీనియర్ నాయకులు మంగలారపు లక్ష్మీనారాయణ, కటకం వెంకటేష్ ​పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here