50 ఏండ్ల తర్వాత దావన్ పల్లి కొండ చెరువుకు జలకళ-ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్

0
137

తాజా కబురు రాయికల్ రూరల్: మండలంలోని చివరి ఆయకట్టు గ్రామమైన దావన్ పల్లి గ్రామ కొండ చెరువుకు ఎస్సారెస్పీ నీరు రావటంపై గ్రామస్దులు హర్షం వ్యక్తం చేశారు. జలకళ సంతరించుకున్న చెరువును గ్రామస్దులు, నాయకులతో కలిసి మంగళవారం ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వేసవికాలంలో ఎన్నడు ఈ చెరువులో చుక్కనీరు లేదని, మిషన్ కాకతీయ ద్వార పూడిక తీయటం నాడు మాజీ ఎంపీ కవిత సహకారంతో 1 కోటి 60 లక్షల రూపాయలను కెనాల్ కోసం మంజూరు చేయటం ద్వారా నేడు ఆ ఫలితాన్ని దావన్ పల్లి గ్రామస్దులు పొందారని,కొండ చెరువు నీటితో జలశోభను సంతరించుకుందని నిధుల మంజూరికి కృషి చేసిన మాజీ ఎంపీ కవితకు,ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు.నాడు కాకతీయులు చెరువులు నిర్మిస్తే నేడు మిషన్ కాకతీయ ద్వారా పూడిక తీసి కాళేశ్వరం జలాలతో నింపిన అపరభగీరధుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు. గ్రామంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం గ్రామపంచాయితీ వద్ద ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామానికి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుంని.చిన్న గ్రామమైన దావన్ పల్లి లో కూడ ఏర్పాటు చేసిందని,రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలన్నదే ముఖ్యమంత్రి లక్ష్యమని,అందుకనుగుణంగా చిన్న,పెద్ద గ్రామమనే తేడా లేకుండా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించుకుంటున్నామన్నారు.ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ జాదవ్ అశ్విని,ఎంపీపీ లావుడ్య సంధ్యారాణి,గ్రామసర్పంచ్ యమున రవి,ఉపసర్పంచ్ డిక్కు నాయక్,నాయకులు తురగ శ్రీధర్ రెడ్డి, గన్నె రాజిరెడ్డి,కోల శ్రీనివాస్, నందునాయక్ ,వెంకటేశ్వర్ రావ్,నందునాయక్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here