10వ,డిగ్రి పరీక్షలు పరీక్షలు జూన్ లో- నో డిటెన్షన్ డిసిషన్ కు ఓకే- 3-12 క్లాస్ స్టూడెంట్లకు ఒలింపియాడ్-మే 15వరకు ఎంసెట్ గడువు

0
152

హైదరాబాద్ డెస్క్ తాజా కబురు: లాక్ డౌన్ ఎఫెక్ట్ తో రాష్ట్రంలో వాయిదా పడ్డ 10వ తరగతి పరీక్షలను జూన్ 15 నుంచి నిర్వహించాలని స్కూల్ఎ డ్యుకేషన్ డిపార్టుమెంట్ నిర్ణయించింది. మార్చి 19న ప్రారంభమైన టెన్ పరీక్షలకు మొదటి మూడు పరీక్షలయ్యాక వాయిదా పడ్డాయి. మిగతా ఎనిమిది పరీక్షలను జూన్లోనే పూర్తి చేసేలా కొత్త టైమ్ టేబుల్ రూపొందిస్తున్నారు. కరోనా కేసులు తగ్గినందున జూన్
లోనే పరీక్షలకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

నో డిటెన్షన్ డిసిషన్ కు ఓకే.

తెలంగాణలోని అన్ని యూనివర్సిటీల పరిధిలో డిగ్రీ, ఇంజనీరింగ్ పరీక్షలు జూన్ మూడో వారంలో ప్రారంభించేందుకు రాష్ట్ర హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి అనుమతి కోరింది. ముందుగా ఫైనలియర్ పరీక్షలు నిర్వహిస్తారు. ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులకు డిటెన్షన్ విధానాన్ని ఎత్తివేసి, అందరినీ ప్రమోట్ చేసే డిసిషనకు అన్ని వర్సిటీలు ఓకే చెప్పాయి.
తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి అన్ని వర్సిటీల రిజిస్టార్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఈనిర్ణయం తీసుకున్నారు. అన్ని యూనివర్సిటీలు జూలైలో పరీక్షలు నిర్వహించుకోవాలని యూజీసీ సూచించింది. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుతున్నందున వారం రోజుల ముందే పరీక్షల షెడ్యూలు రెడీ చేస్తున్నారు. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.

3-12 క్లాస్ స్టూడెంట్లకు ఒలింపియాడ్

ఒలింపియాడ్ 2020 పరీక్షలకు టైమ్ టేబుల్ రిలీజైంది. సెంట్రల్ గవర్నమెంట్ ఈ గవర్నెన్స్ వింగ్ ఈ వివరాలను
వెల్లడించింది. మూడో తరగతి నుంచి 12 తరగతి వరకు విద్యార్థులందరూ వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు.
గణిత, సామాన్య, ఇంగ్లీష్, హిందీ సబ్జెక్టులలో పరీక్షలు నిర్వహిస్తారు. ఆగస్టు 1 వరకు రిజిస్ట్రేషన్ చేసుకునే గడువు ఉంది.వివరాలన్నీ ఈ వెబ్ సైట్లో అందుబాటులో ఉన్నాయి. www.cscolympiads.in

మే 15వరకు ఎంసెట్ గడువు
తెలంగాణ ఎంసెట్ అప్లికేషన్ గడువును మరికొద్ది రోజులు పొడిగించారు. ఎలాంటి లేట్ ఫీ చెల్లించే అవసరం లేకుండా మే 15 వరకు ఆన్లైన్ లో చేసుకునే అవకాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here