మెట్పల్లి తాజా కబురు: ఆరుగాలం పంట పండించిన రైతు కన్నీరుమున్నీరవుతున్నారు,ప్రభుత్వం సూచించిన పంటలను వేసిన రైతులకు దోమపోటు గ్రహాపాటుగా మారింది,దోమపోటుతో కళ్లముందు పంట సర్వనాశనం కావటాన్ని చూసి భరించలేక రైతు పంటనె తగలబెట్టిన సంఘటన జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలంలో చోటుచేసుకుంది.
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం అత్మకూర్ గ్రామానికి చెందిన ఈ రైతుపేరు తుమ్మల తిరుపతి రెడ్డి, ఈ రైతు ప్రతి సంవత్సరం భూమికి తగ్గట్టు పంటలను వేస్తు ఉండేవాడు, ఈ సారీ ప్రభుత్వం సూచించిన పంటలను వెయ్యాలనటంతో సన్నరకం (జై శ్రీరాం) వేసాడు,నాలుగు ఎకరాలకు సుమారు లక్ష రూపల వరకు పెట్టుబడి పెట్టాడు,పంట చేతికొస్తుందన్న సమయంలో వరి పంటకు దోమపోటు సోకింది,ఎన్నీ రసాయానాలు వాడినా నాలుగు ఎకరాలకు సోకింది,దీంతో పంట తీయాలంటె మళ్లీ పెట్టుబడి కావాలని ,తీసినా మరింత నష్టం వాటిల్లుతుందని బావించిన తిరుపతి రెడ్డి నాలుగు ఎకరాల పంటకు నిప్పు అంటించాడు,అందులో ఎకరం పూర్తిగా కాలిపోతున్న తరుణంలో పక్కనె ఉన్న రైతుల పంటలకు నిప్పు అంటుకుంటుందని ఆర్పివేసారు.