సంక్షేమ కార్యక్రమాల లక్ష్యసాధనకు అందరు కృషి చేయాలి – జిల్లా కలెక్టర్ రవి గుగులోత్

0
80

తాజా కబురు జగిత్యాల టౌన్:ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలుకు అధికారులందరు కృషిచేయాలని జిల్లా కలెక్టర్ రవి గుగులోత్ అధికారులును ఆదేశించారు. జిల్లా కలెక్టర్ శిభిర కార్యాలయం నుండి అడిషనల్ కలెక్టర్లు, అర్డీఓ మరియు తహసీల్దార్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బముగా వివిధ కార్యక్రమాల పురోగతిపై సమీక్షిస్తూ, రైతుబందు కార్యక్రమం ద్వారా రైతులకు బ్యాంకు అకౌంట్ ద్వారా డబ్బుల పంపిణి చేయడం జరుగుతుందని, కోన్ని సందర్బాలలో ఇబ్బందులు తలెత్తేవని, ఇప్పుడు అలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం అగస్టు 1, 2020 నాటికి ఉన్న ఫార్మ్ 1ఎ, ఫార్మ్ 1బి ల పిడిఎఫ్ కాపిలను తయారు చేసి తహసీల్దార్లు దృవీకరించి, ఏడు కాపిలను తయారుచేసి గ్రామ, మండల, డివిజన్, జిల్లా కేంద్రాలకు పంపుతూ సిసిఎల్ తోపాటు ప్రభుత్వ రెవెన్యూ సెక్రటరి గారికి కూడా పంపించవలసి వుంటుందని పేర్కోన్నారు. దీనివలన రికార్డులను ఎవరు కూడా మార్చడానికి వీలు కలుగదని పేర్కోన్నారు. జిల్లాలోని 18 మండలాల లొని అన్ని గ్రామాలకు సంబంధించిన ఫార్మ్ 1ఎ, 1బిలు 7కాపీల చోప్పున ప్రింట్ ఇవ్వడానికి సాధ్యపడదు కాబట్టి, జరిగిన ఎన్నికల సమయంలో ఎలక్ట్రోరోల్స్ ప్రింట్ చేయించిన ప్రింటింగ్ ప్రెస్ లను గుర్తించి, ప్రింటింగ్ ప్రెస్ సామర్థ్యం, కోవిడ్ వలన పనిచేస్తున్న వారి సంఖ్యను పరిగణలోకి తీసుకొని 18 మండలాలకు సంబందించిన కాపీలను ప్రింట్ చేయించడంతో పాటు, వాటిని దృవీకరించి అగస్టు 10, 2020 లోగా గ్రామ స్థాయి నుండి రాష్ట్రస్థాయి వరకు పంపించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. జిల్లాలోని అన్ని గ్రామాలలో పల్లెప్రకృతి వనాల కొరకు 20 గుంటల నుండి 1ఎకరానికి తగ్గకుండా భూములను గుర్తించి పనులు ప్రారంభించాలని పేర్కొన్నారు. భూమి లేనట్లయితె ఇదివరకే కమ్యూనిటి ప్లానిటేషన్ చేసినవి గాని, విద్యాసంస్థలు, ప్రభుత్వ కమ్యూనిటి భూములను గుర్తించాలని, ఇవి కూడా లేకుండా లెన్నట్లయితే అటవి భూములను గుర్తించి వారంలోగా పనులు ప్రారంభించాలని అన్నారు. సియంఆర్ కార్యక్రమం ద్వారా బియ్యం పంపిణి చేయాలని సూచించారు. జిల్లాలో రైతువేధికల కొరకు 71 స్థలాలను గర్తించి పనులు చేపట్టడం జరుగుతుందని నిర్మాణ పనులలో కొన్ని సమస్యలు ఎదురయినట్లుగా గుర్తించడం జరిగిందని, ఎట్టి పరిస్థితులలో ప్రారంభించిన పనులను ఆపి మరోచోట ప్రారంభించరాదని, మరికోన్ని చోట్ల స్థలాలను గుర్తించి పనులను ప్రారంభించ వలసివుందని, సెప్టెంబర్ చివరిలోగా పనులు పూర్తిచేసుకోవనెల చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రతిరోజు అధికారులు పనుల పురోగతిని పర్యవేక్షించాలని, ఎక్కడ కూడా ఇసుకకు సంబంధించి ఇబ్బందులు కూడా తలెత్తకుండా చర్యలు చేపట్టడం జరిగిందని పేర్కొన్నారు. ఇసుక పంపిణిలో ఏవరైన అక్రమాలకు పాల్పడినట్లయితే వారిపై చట్టంప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. రైతువేధిక నిర్మాణాల నిర్మాణాలకు కావలసిన ఇసుకను వారం రోజులలో అందించడం జరుగుతుందని, పంపిణి చేసిన ఇసుకను రైతువేదిక నిర్మాణాలకు కాకుండా వేరె ఇతర పనులకు ఉపయోగించకుండా వీఆర్వో, విఆర్ఏ లు పర్యవేక్షించాలని సూచించారు. ప్రభుత్వం అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో ఇ-ఆఫీస్ ద్వారా కార్యాకలాపాలు నిర్వహించడానికి ఆలోచిస్తుందని, అందులో బాగంగా జిల్లాలోని అన్ని కార్యాలయాలలో అగస్టు-15 లోగా ఇ-ఆఫీస్ విధానం ద్వారా పనులు చేపట్టాలని సూచించారు. ఇ-ఆఫీస్ కొరకు అందరు అవగాహన కల్పించుకోవాలని సూచించించారు. కార్యాలయాలలో నిరుపయోగంగా కండెం చేయవలసిన స్థితిలో ఉన్న పాత వాహనాలను గుర్తించి వాటి వివరాలను పంపించాలని తెలిపారు. వ్యవసాయ గోదాములు, ఫుడ్ ప్రాసెసింగ్ లోన్స్ కొరకు గుర్తించిన స్థలాలను మరోసారి సరిచూసుకొవాలని అన్నారు. తహసీల్దార్లు ఉధయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు వారి మండలంలో అందుబాటులో వుండాలని ఆదేశించారు. టెలికాన్ఫరెన్స్, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇచ్చిన ఆదేశాలను తప్పక పాటించాలని ఆదేశించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here