శునకానికి ప్రేమతో… విగ్రహాం కట్టించాడు…

0
170
తాజాకబురు
tajakaburu line

ఎడిటర్: నాగిరెడ్డి రఘుపతి ….

శునకాలు మనిషికి విశ్వాసంగా ఉంటాయని అంటారు, ప్రతిసారీ శునకమె మనిషి పట్ల విదేయత పాటిస్తు ఉంటుంది, కానీ ఇక్కడ శునకం పట్ల ఆ వ్రుద్దుడు విశ్వాసంగా ఉన్నాడు, శునకంతో గడిపిన రోజులను తలుచుకుంటు శునకం మరణిస్తె ఏకంగా విగ్రహామె కట్టించాడు, అంతెకాదు తాను లేకపోయిన ఆ విగ్రహానికి అనునిత్యం పూజలు చెయ్యమని కుటుంబ సభ్యులను ఆదేశించాడు…ఆ వింత ఏంటో తెలుసుకోవాలంటె మనం జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం వెళ్లాల్సిందె…

విశ్వాసాలన్నవి మనిషి మనిషి మద్య ఉంటాయి అంటారు, కానీ మనుసుంటె ఎవరితోనైన తమ విశ్వాసాన్ని చూపించవచ్చు, తనకు చెలిమిగా ఉన్న శునకానికి ఎనలేని విశ్వాసం చూపించాడు ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్రుద్దుడు, ఇతని పేరు పోసయ్య  గ్రామం జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం బర్థిపూర్, పోసయ్య వ్యవసాయం చేసెవాడు, తన వ్యవసాయ భూమిలో పనులకోసం తన ఇంటి ముందు తిరుగుతున్న ఓ శునకాన్ని చిన్న వయసునుండి పెంచుకోసాగాడు, ఆ శునకం పోసయ్య విడిచి ఒక్క క్షణం ఉండేది కాదు, అలాగె పోసయ్య కూడా ఎక్కడికి వెళ్లిన ఆ శునకాన్ని తీసుకొనె వెళ్లెవాడు, అలా కొంతకాలం వ్యవసాయ పనులకు వెళితె సాయం చెయ్యటం, అలాగె ఇంట్లోకి ఎవరైన అపరచితులు వస్తె దబాయించటం, పోసయ్య ఇంట్లో లేకపోయిన అన్నీ తానై పెరిగింది , గ్రామంలో అంటువ్యాధులు ప్రబలి చాలావరకు మరణించాడు, అవి శునకాలతోనె జరుగుతున్నాయని, కుక్కలకు వెర్రీ వ్యాధి వచ్చి మనుషులపై దాడి చేస్తున్నాయని గ్రామతీర్మాణం చేసి గ్రామంలో ఉన్న అన్ని శునకాలను చంపెయ్యాలని తీర్మాణించాయి, పోసయ్య శునకం ఎలాంటి ఆనారోగ్య సమస్య లేకున్న గ్రామ కట్టుబాట్లను గౌరవించాలని ఆ శునకాన్ని కూడా చంపేందుకు ఆయన అనుమతించాడు, దాంతో శునకాన్ని గ్రామస్తులు చంపేశారు, దాంతో ఆ శునకం లేని లోటు అతనికి చాలా ఎదురైంది, తనతో గడిపిన క్షణాలను ఎప్పుడు ఇంట్లోవాళ్లకు నెమరేసుకుంటు ఉండేవాడు, కానీ అతని మనసంతా శునకం పైనె ఉండేది, తాను ఆనారోగ్యపాలయ్యాడు, తన కూతురు కొడుకు చెప్పి శునకం మరణించినప్పుడు ఎక్కడైతె కననం చేశారో అదె చోట శునకానికి విగ్రహాం కట్టించాడు, అనునిత్యం ఆ విగ్రహాం వద్ద తన శుకనం జ్జాపకాలను తలుచుకుంటు ఉండెవాడు, అతను మరణించెటప్పుడు ఆ శునక విగ్రహానికి నిత్యం పూజలు నిర్వహించాలని చెప్పి మరణించాడు, గత ఇరువై సంత్సరాల నుండి ఆ కుటుంబ సభ్యులు ఆ శునక విగ్రహానికి నిత్యం పూజలు నిర్వహిస్తారు ప్రతి ఆదివారం టెంకాయ కొట్టి వారి భక్తి చాటుకుంటారు, రెండు మూడు సంవత్సరాలకోసారి విగ్రహాన్ని అలంకరిస్తారు,నిత్యం దేవుడికి వలె పూజలు నిర్వహిస్తేనె తన పోసయ్య ఆత్మశాంతిగా ఉంటుందని అతను చెప్పిన మాటలను తూచ తప్పకుండా పాటిస్తున్నామని అంటున్నారు కుటుంబ సభ్యులు…మనుషుల మనుషుల మద్య సాయం చేసుకున్న పట్టించుకోలేని ఈ రోజుల్లో తనతో తనకు సాయం చేసిన శునకం కోసం తనకున్న విశ్వాసంతో విగ్రహాం కట్టించి తన ప్రేమను చాటుకున్న పోసయ్య ఎందరికో స్పూర్తిదాయకం..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here