భారత వ్యవసాయ రంగం లో నవశకం

0
75

జగిత్యాల తాజాకరు: కథలపూర్ మండలంలోని కలికోట,ఇప్పపెల్లి,పోతారం, అంబారిపేట్ గ్రామాల్లో ఆదివారం బిజెపి కిసాన్ మోర్చా జగిత్యాల జిల్లా అధ్యక్షులు కోడిపెల్లి గోపాల్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన వ్యవసాయ చట్టం ను గురించి రైతులకు అవగాన కల్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ భారత దేశాన్ని విశ్వ గురువుగా నిలపాలని,130 కోట్ల భారతీయులకు ప్రగతి ఫలాలు అందించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అహర్నిషలు కృషి చేస్తున్నారని,రైతు సౌభాగ్యమే దేశ సౌభాగ్యమని నమ్మి, ఆచరణలో చూపిస్తున్న ప్రధాని 2022 నాటికీ రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలని లక్ష్యంగా నిర్ధేశించుకున్నారని ఈ చట్టం భారత వ్యవసాయ రంగం లో నవశకం అని ఈ దిశగానే రైతుల కోసం నూతన వ్యవసాయ చట్టానికి నాంది పలికినందున రైతులు సంతోషం వ్యక్తం చేస్తూ మోదీకి పోస్ట్ కార్థుల ద్వారా కృతజ్ఞతలు తెలుపుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమం లో బీజేవైఎం సాయి, భాజపా నాయకులు, రైతులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here