భర్త ఇంటి ముందు భార్య బైఠాయింపు

0
168

తాజా కబురు రాయికల్: గత 6 సంవత్సరాలుగా కాపురానికి తీసుకువెళ్లకుండా ఇబ్బందులకు గురిచేస్తూ వేరొక పెళ్లి చేసుకొని తనకు అన్యాయం చేస్తున్న తన భర్త అయిన మూడపెల్లి గోపి చూస్తున్నాడని,న్యాయం చేయాలని కోరుతూ మంగళవారం మండలంలోని మైతాపూర్ గ్రామానికి చెందిన అడేటి జల తన భర్త గోపి‌ ఇంటిముందు తన కూతురు,బంధువులతో బైఠాయించిన ఘటన రామాజీపేట గ్రామంలో చోటుచేసుకుంది.
మండలంలోని మైతాపూర్ గ్రామానికి చెందిన అడేటి జలకు, రామాజీపేట గ్రామానికి చెందిన మూడపెల్లి గోపితో 20 సంవత్సరాల క్రితం పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. వీరికి మొదటి సంతానం కూతురు కాగా, రెండవ సంతానంలో కొడుకు పుట్టి అనారోగ్యంతో ఒక సంవత్సరానికే మరణించగా, నాకు నువ్వు, కూతురు వద్దని భార్య జలను వేధింపులకు గురిచేసేవాడని ఈ విషయాన్నిపలు మార్లు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువచ్చి సర్ది చెప్పినప్పటికీ, పోలీసు స్టేషన్ లో పలు మార్లు పిర్యాదు చేసిన గోపిలో ఎలాంటి మార్పు లేకపోగా కేసు విచారణలో ఉండగానే గోపి విదేశానికి వెళ్ళిపోయాడు. అప్పటి నుండి జల పుట్టింటిలోనే ఉంటుంది. గత 3 నెలల క్రితం తిరిగి వచ్చిన విషయాన్ని తెల్సుకున్న జల పలు మార్లు భర్త గోపి ఇంటికి వెళ్లినప్పటికీ తనను ఇంటిలోకి రాకుండా అడ్డుకునే వారని, గత రెండు రోజుల క్రితం గోపి వేరే వివాహం చేసుకున్నాడనే విషయాన్ని తెల్సుకున్న జల తనకు న్యాయం కావాలంటూ తన బంధువులతో కల్సి భర్త ఇంటి ముందు బైఠాయించింది. విషయం తెల్సుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని జలకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో ఆమె దీక్ష విరమించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here