జర్నలిస్ట్ ఫై హత్యాయత్నం అమానుషం

0
339
  • ఖండించిన జర్నలిస్ట్ సంఘాలు, ప్రతిపక్షాలు
  • విచారణ జరిపించాలని డిమాండ్ చేసిన జర్నలిస్టు సంఘాలు
  • దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్

– లేనిపక్షంలో ధర్నాలు రాస్తారోకోలు చేస్తాం.. జర్నలిస్టులు

తాజా కబురు వేములవాడ ప్రత్యేక ప్రతినిధి: ప్రజాస్వామ్యం అపహస్యం అయ్యే సంఘటన వేములవాడ లో చోటుచేసుకుంది.. ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం పాటుటడాల్సిన కౌన్సిలర్, రాజకీయ నాయకులు గుండాలుగా వ్యవహరిస్తే ఇక ప్రజాస్వామ్యం ఎందుకౌతుంది..అర్థరాత్రి సుమారు 2 గంట ప్రాంతంలో మద్యం సేవించి వేములవాడ పట్టణానికి చెందిన ఇట్టేడి గౌతంబాబు అనే సీనియర్ జర్నలిస్టు ఇంటికి కర్రలతో దాడికి పాల్పడిన సంఘటన వేములవాడలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే వేములవాడ పట్టణానికి చెందిన ఇట్టేడి గౌతంబాబు గత కొన్ని సంవత్సరాలుగా పలు పత్రికల్లో వార్తలు రాసుకుంటూ తనదైన శైలిలో సామాన్య ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు తనవంతు కృషి చేస్తున్నారు. అయితే దాడి చేసిన వ్యక్తి తెరాస పార్టీ కౌన్సిలర్ భర్త అయిన గూడూరి మధు అనే నాయకుడు, మరికొంతమంది జర్నలిస్ట్ గౌతంబాబు ఇంటికి బుధవారం అర్ధరాత్రి 2 గంట ప్రాంతంలో మద్యం సేవించి హత్యాయత్నానికి పాల్పడ్డాడని వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ దాడిపై బిజెపి పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ తీవ్రంగా ఖండించారు. ఆయన మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రజాస్వామ్యం లో జర్నలిస్టులకు సైతం ఒక పిల్లర్ గా పరిగణించి, నిజాలను నిర్భయంగా రాసే జర్నలిస్ట్ లపై దాడులు చేయడం ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేయడమే అవుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ దాడికి పాల్పడిన వారిఫై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ సీనియర్ జర్నలిస్టు ఇట్టెడి గౌతంబాబు ఇంటికెళ్ళి దాడులు చేయడం గుండాయిజానికి నిదర్శనం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలచే ఎన్నుకోబడ్డ నాయకులు గుండాలుగా వ్యవహరిస్తే ప్రజలకు ఏం సమాధానం చెబుతారు అని ఎద్దేవా చేశారు. జర్నలిస్ట్ గౌతంబాబుపై దాడిచేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అనంతరం టియూడబ్ల్యుజే హెచ్ 143 రాష్ట్ర ఉపాధ్యక్షులు లాయక్ పాషా జర్నలిస్ట్ గౌతంబాబు పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయ నాయకులు వీధి రౌడీలుగా వ్యవహరించడం ఆ పార్టీకి చెడ్డపేరు తెచ్చినవారు అవుతారని ఆయన తెలిపారు. ఈ దాడిని మంత్రి కేటీఆర్ ద్రృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు. అనంతరం తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (ఐజేయూ) అధ్యక్షులు హింగే శ్రీనివాస్ మాట్లాడుతూ సీనియర్ జర్నలిస్టు ఇట్టెడి గౌతంబాబు పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. టీయూడబ్ల్యు జె హెచ్ ౧౪౩ ఉపాధ్యక్షుడు ఎండీ రఫీక్ మాట్లాడుతూ గత మూడు దశాబ్దాలుగా జర్నలిజంలో కొనసాగుతూ యువ జర్నలిస్టులకు ఆదర్శనంగా నిలిచిన నిజానికి వెన్నుదన్నుగా ఉండే సీనియర్ జర్నలిస్ట్ గౌతమ్ బాబుపై జరిగిన హత్యాయత్నం అత్యంత హేయమైదన్నారు.
అనంతరం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు, ఉపాధ్యక్షులు పెరుక రవి, తొగరి కరుణాకర్ లు మాట్లాడుతూ పార్టీలకతీతంగా పనిచేసే జర్నలిస్ట్ లపై దాడులు చేయడం కలం గళాన్ని అవమానించడమే అవుతుందని అభిప్రాయ పడ్డారు. నిజాలను నిర్భయంగా రాసే జర్నలిస్ట్ గౌతంబాబు పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. అనంతరం వేములవాడ పట్టణ బిజెపి పార్టీ అధ్యక్షుడు రేగుల సంతోష్ బాబు మాట్లాడుతూ ఈ దాడికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒక వేళ రాజకీయ బలం చూపిస్తే ప్రతిపక్ష బలం చూపించాల్సి వస్తుందని ఈ సందర్భంగా హెచ్చరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here