తాజాకబురు సినిమా
బిగ్ బాస్ నాలగవ సీజన్ ఆరంభమై వారం గడిచిపోయింది, అలాగె సూర్యకిరణ్ ఎలిమినేట్ అయ్యాడు, ఇప్పుడు జరుగుతున్న షో అంత సప్పసప్పగా సాగుతుంది, హార్టిఫియల్ గా నటిస్తూ నవ్విస్తూ, అవతలి వ్యక్తులను ఆకట్టుకోవటమె బిగ్ బాస్ లక్ష్యంగా కంటెస్టెంట్స్ ముందుకు సాగుతున్నారు, ఇదిలా ఉంటె అసలె ఎంతొ అమాయకురాలు అయిన గంగవ్వ రెండుమూడు రోజులు ఎలాగలో తట్టుకుంది, కానీ రోజులు గడుస్తున్నకొద్ది చుట్టుపక్కల ఉన్నవాళ్ల పోరు భరించలేకా, తాను ఉన్నట్టు ఉండలేకా అవతలివాళ్లకు సమాదానం చెప్పలేకా నానా ఇబ్బందులు ఎదుర్కోంటుంది..ఈ షో ను గంగవ్వను ద్రుష్టిలో పెట్టుకొని అందరు చూస్తున్నారని అందరికి తెలుసు అందుకె గంగవ్వను షో నుండి పంపించె ఆలోచన చివరివరకు కూడా ఉండదని తెలుస్తోంది, అమాయకమైన గంగవ్వ ఉన్నది ఉన్నట్టు, మనుసులో ఏది దాచుకోకుండా మాట్లాడుతుంది, కొందరిని మోప్పించాలని ,కొందరిని ఆకట్టుకోవాలని,నటించినట్టు చెయ్యాలని గంగవ్వకు తెలియదు అందుకె కల్మషం లేని ఆమెకు ఆడియన్స్ టన్నులకొద్ది ఓట్లు వేస్తూనె ఉన్నారు,అక్కడున్న అందరూ ఆమె ఈడుకు తగ్గ వాళ్లు కాకపోయినా అందరితో బాగానే మాట్లాడుతోంది. అయినా ఎందుకో ఇమడలేకపోతోంది. “నా వల్ల కాదు బిడ్డా, నేను పోతా” అని పదే పదే అభ్యర్థిస్తోంది. దానికి నాగ్ బదులు చెప్పలేక అది ప్రేక్షకుల చేతిలో ఉంది, తానేం చేయలేను అని చేతులెత్తేశారు. నిన్నటి నామినేషన్ ప్రక్రియలోనూ అవ్వే మొదటగా పడవ దిగి వెళ్లిపోవాలన్న కోరికను మరోసారి బయటపెట్టింది. కానీ బిగ్‌బాస్ యాజమాన్యం అందుకు ఒప్పుకుంటుందా? టీఆర్పీ కోసం ఏరికోరి తెచ్చుకున్న అవ్వను వదులుకుంటుందా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది
నీరసించిపోతున్నఅభిమానులు….
పైగా బిగ్‌బాస్ హౌస్‌లో వినోదాన్ని పంచుతున్న ఏకైక వ్యక్తి అవ్వ. ఆమెతోనే సరదాలు, ఆమె వేసే పంచ్‌లతోనే ప్రోమోలు, ఎపిసోడ్లు గడిచితున్నాయి. అలాంటి అవ్వ వెళ్లిపోతే షో బోసిపోతుందేమో అన్న సందేహం బిగ్‌బాస్ టీమ్‌ను భయభ్రాంతులకు గురి చేస్తుందేమో! కానీ ఎన్నాళ్లు ఊరడించినా అవ్వ ఎక్కువ రోజులైతే ఉండలేదు. ఇదే వాస్తవం. కాదు, కూడదు అంటే బిగ్‌బాస్‌తోనే లడాయి పెట్టుకుని మరీ ఇంట్లో నుంచి వెళ్లిపోయే రకం. దీంతో ఎలాగైనా గంగవ్వను గెలిపిద్దామని కోటి ఆశలు పెట్టుకున్న అభిమానులు నిరుత్సాహపడుతున్నారు. ఆమెను పంపించడానికి ఏమాత్రం ఇష్టం సుముఖత వ్యక్తం చేయడం లేదు. కానీ వయసుతోపాటు వచ్చే అనారోగ్య సమస్యలు, హౌస్‌లో ఉన్న కృత్రిమత్వం ఆమెను ఉండనివ్వట్లేదు. కాబట్టి షో కాస్త పుంజుకునేవరకు ఎదురు చూసి బిగ్‌బాస్ యాజమాన్యమే ఆమెను నేరుగా ఇంటికి పంపించే అవకాశాలు ఎక్కువగానె ఉన్నాయి, ఎన్నాళ్లు ఆ షో ను తన భుజస్కందాలపై ఎత్తుకొని ఉంటుంది…