తాజా కబురు కోరుట్ల :పెట్రోల్ ఒక్కసారీ పోయించుకున్నప్పుడు ఎక్కువ మరోసారి పోయించుకున్నప్పుడు తక్కువ వస్తుందని ఆరోపిస్తు వాహానచోదకులు పెట్రోల్ బంక్ ముందు ఆందోళన చేపట్టిన సంఘటన కోరుట్ల పట్టణంలో చోటుచేసుకుంది..
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో శనివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పట్టణంలోని నంది విగ్రహం దగ్గర ఉన్న ఓ పెట్రోల్ పంపు వద్ద పెట్రోల్ పోయడంలో అవకతవకలు చేస్తున్నారని ఆ పెట్రోల్ పంపు యాజమాన్యంపై వినియోగదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎన్ని డబ్బులు చెల్లిస్తె అంతె పెట్రోల్ రావాలి కానీ తక్కవ పెట్రోల్ పోసి వినియోగదారులను మొసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు, తక్షణమె ఇలాంటి బంక్ లపై చర్యలు తీసుకోవాలని అన్నారు..