అక్రమ కార్యకలాపాలపై జిల్లా పోలీసులు వరుస దాడులు…

0
85

జగిత్యాల తాజా కబురు: జిల్లా వ్యాప్తంగా అక్రమ కార్యకలాపాల పై పోలీసులు వరుస దాడులు మొదలు పెట్టారు. ప్రభుత్వ నిషేధిత గుట్కా,ఇసుక అక్రమ రవాణా, పేకాట, పీడీఎస్ రైస్, గంజాయి స్మగ్లింగ్ వంటి నియంత్రణకు జిల్లా పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని కరీంనగర్ పోలీస్ కమిషనర్ వి. బి కమలసన్ రెడ్డి ఆదేశాలు జారీ చేయడంతో జిల్లా కేంద్రంలోని టవర్ సర్కిల్ ప్రాంతంలో గల మహమ్మద్ బలిగూర్ రహమాన్ కు చెందిన ఎం.బి.ఆర్ జనరల్ స్టోర్లో ప్రభుత్వ నిషేధిత గుట్కా అమ్ముతున్నారనే సమాచారంతో టౌన్ ఇన్స్పెక్టర్ జయేష్ రెడ్డి, ఎస్.ఐ కిరణ్ తమ సిబ్బందితో కలసి తనిఖీ నిర్వహించగా 10 బ్యాగుల్లో నిల్వవుంచిన సుమారు 2 లక్షల 45 వేల 815 రూ.ల గుట్కా స్వాధీనం చేసుకోని,తదుపరి విచారణ నిమిత్తం గుట్కా ను,సంబంధిత వ్యక్తిని పట్టణ పోలీస్ స్టేషన్ కి తరలించి కేస్ నమోదు చేశారు.

మెట్పల్లి పరిధిలో…

మెట్పల్లి పట్టణంలో లక్ష్మీనరసింహ కిరాణషాప్ లో సి.ఐ రవికుమార్ సిబ్బందితో కలసి తనిఖీ నిర్వహించగా 3 బ్యాగుల్లో నిల్వవుంచిన సుమారు 50 వేల రూ.ల గుట్కా స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు.

మాల్యాల పరిధిలో…

కొండగట్టులో ఓ కిరాణం షాప్ లో సీసీఎస్ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ సిబ్బంది తో కలసి తనిఖీ నిర్వహించగా 2 బ్యాగుల్లో నిల్వవుంచిన సుమారు 10వేల రూపాయల గుట్కా స్వాధీనం చేసుకొని సంబంధిత వ్యక్తిని మాల్యాల పట్టణ పోలీస్ స్టేషన్ కి తరలించి కేస్ నమోదు చేశారు.లంబడిపల్లి గ్రామ శివారులో రామడుగు మండలానికి చెందిన చల్ల సతీష్ అనే వ్యక్తి అక్రమంగా ఆటోలో రేషన్ బియ్యం తరలిస్తున్నారనే సమాచారం మేరకు తనిఖీ నిర్వహించగా సుమారు 8 క్విటాళ్ల రేషన్ బియ్యం పట్టుకొని కేస్ నమోదు చేసినట్లు ఎస్.ఐ నాగరాజు తెలిపారు.

కోరుట్ల పరిధిలో…
సోమేశ్వర రైస్ డిపో కు చెందిన తుగండ్ల అశోక్ అనే వ్యక్తి అక్రమంగా రేషన్ బియ్యం నిలువ ఉంచి ఆముతున్నారనే సమాచారం మేరకు తనిఖీ నిర్వహించగా సుమారు 56 బ్లాగు లో నిల్వవుంచిన 12 క్విటాళ్ల రేషన్ బియ్యం పట్టుకొని కేసు నమోదు చేసినట్లు అలాగే నాగులపేట గ్రామంలో సుమారు 50 ట్రాక్టర్ల లోడ్ గల ఇసుక డంప్ లను సీజ్ చేసి ఇసుకను సంబంధిత తాసిల్దార్ కార్యాలయంకి అప్పగించి ఇసుక అక్రమంగా రవాణా చేసిన, అక్రమంగా నిలువ చేసిన వారి పై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్.ఐ రాజాప్రమిల హెచ్చరించారు.

రాయికల్ పరిధిలో..
ఇటిక్యాల గ్రామం మీదుగా ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ఒక ఇసుక ట్రాక్టర్ను సీజ్ చేసినట్లు ఎస్.ఐ ఆరోగ్యం తెలిపారు.

మల్లాపూర్ పరిధిలో…
సిర్పూర్ గ్రామ శివారులో పేకాట ఆడుతున్న7 గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 17,990 రూ.లను,5 బైక్స్ ను,8 మొబైల్ ఫోన్స్ ను స్వాధీనం చేసుకొని వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్.ఐ రవీందర్ తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here