హై వోల్టేజ్ కాన్ఫిడెంట్…బుడ్డోడి సమయస్ఫూర్తిని అభినందించిన కేటీఆర్..

0
4

హై వోల్టేజ్ కాన్ఫిడెంట్…బుడ్డోడి సమయస్ఫూర్తిని అభినందించిన కేటీఆర్..

ఆర్థికంగా బతికిన వాళ్లా… ఆర్థికంగా లేని వాళ్ళ అన్నది ముఖ్యం కాదు సమయస్ఫూర్తితో, క్రమశిక్షణ అలవర్చుకోవడం కోసం తమకు తాము మార్చుకున్న వాళ్ళె గొప్పోళ్లు, జీవితంలో ఎదగాలంటే ముఖ్యంగా కావలసింది క్రమశిక్షణ అలాంటి” శిక్షణ ” తన పిల్లాడికి ఇవ్వాలనుకున్నారు ఆ తల్లిదండ్రులు, అంతే ఆ పిల్లాడి వ్యక్తిత్వం ఒక్కసారిగా మారిపోయింది, జగిత్యాల పట్టణానికి చెందిన ప్రతాప్ వీర గౌడ్ అనూషకు ఇద్దరు కొడుకులు, అందులో చిన్నకొడుకు పేరు శ్రీప్రకాశ్, ఆరవ తరగతి చదువుతున్నాడు, కరోనా లాక్ డౌన్ సమయంలో అందరి పిల్లల్లాగే ఉదయం 11 గంటల వరకు నిద్ర లేకపోవడంతో ప్రకాష్ కు జీవిత విలువ క్రమశిక్షణ ఇవ్వాలనే ఉద్దేశంతో తల్లిదండ్రులిద్దరూ పేపర్ బాయ్ గా చేయమని పెట్టించారు దీంతో నిత్య 4 గంటలకు బస్టాండ్ వద్ద పేపర్ ని తీసుకుని వెళ్లి పట్టణంలోని పలు వీధుల్లోని ఇళ్లల్లో పేపర్ వేస్తున్నాడు, అయితే నిత్యం ఉదయం ఐదు గంటలకు వీధుల గుండా తిరుగుతూ పేపర్ వేసే ప్రకాశ్ ను చూసి కొందరు యువకులు అతడిని మాట్లాడించే ప్రయత్నం చేసిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది ఆ పిల్లవాడు మాట్లాడే విధానం అతని సమయస్ఫూర్తి పలువురు నెటిజన్ల మన్నన పొందుతుంది, పిల్లాడి వీడియో వైరల్ కావడంతో రాష్ట్ర మంత్రి కేటీఆర్ అతని వీడియో చూసి ట్విట్టర్లో అభినందించాడు. నేట్ పిల్లలు సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతుందనే భ్రమలో అస్తమానం ఫోను పట్టుకుని పెరుగుతున్న నేపథ్యంలో చిన్న వయసులో కూడా క్రమశిక్షణ తో పాటు అద్భుతమైన మేధస్సును కలిగిన ఈ బుడ్డోడు ఎందరికో ఆదర్శం….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here