అసిస్టెంట్ ఫ్రౌఫెసర్ పడాల తిరుపతి

రాయికల్ తాజా కబురు: హిందూ సంస్కృతి కి ప్రతిబింబాలు మన పండుగలని జగిత్యాల డిగ్రీ కళాశాల అసిస్టెంట్ ఫ్రౌఫెసర్ పడాల తిరుపతి అన్నారు. శనివారం పట్టణ కేంద్రంలోని శిశుమందిర్ ఆవరణలో, భూపతిపూర్ ఉన్నత పాఠశాల ఆవరణలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆధ్వర్యంలో జరిగిన విజయ దశమి ఉత్సవాలకు ప్రధాన వక్తగా పాల్గొని మార్గదర్శనం చేసి మాట్లాడుతూ భారతీయ జీవన విధానంలో పండుగలకు ప్రత్యేక స్థానం వున్నదని, ఆర్.ఎస్.ఎస్. నిత్య శాఖ ద్వార ఉత్తమమైన దేశభక్తి పూరితమైన వ్యక్తి నిర్మాణం చేస్తుందని, భారతదేశానికి పూర్వ వైభవం తీసుకువచ్చి వసుదేక కుటుంబ స్థాపన చేసి మన దేశాన్ని విశ్వ గురు స్థానంలో నిలపడము, సమాజాన్ని సంఘటితం చేయడము, హిందూ ధర్మ పరిరక్షణ కు కఠిబద్ధులను నిర్మాణం చేయడము ధ్యేయంగా పని చేస్తుందని అన్నారు. నేడు భారతదేశం ప్రపంచంలో బలీయమైన శక్తివంతమైన దేశంగా ఎదుగుతుందని ఇది మనకు గర్వకారణమని అన్నారు.ఈ కార్యక్రమంలో స్వయం సేవకులు, కార్యకర్తలు తోపారపు రవీందర్, కుర్మ మల్లారెడ్డి, వేల్పుల స్వామి యాదవ్, ఎద్దడి ముత్యంపు రాజు రెడ్డి, గాజంగి అశోక్, బోడ్గం మోహన్ రెడ్డి, బొమ్మకంటి రాంగోపాల్, వాసం జలంధర్, కుర్ర శ్రీనివాస్, మంగళారపు లక్ష్మీనారాయణ, జక్కుల ప్రసాద్, నిమ్మల గంగారెడ్డి, వాసాల మహేష్, సూర సాయి తదితరులు పాల్గొన్నారు.