హరివిల్లులోని రంగులన్నీ నేలకు దిగే రోజు ‘హోలీ’

0
46
mytahapur-holi-taja-kaburu

 తాజా కబురు హైదరాబాద్ డెస్క్ :ఈ హోలీ రోజున అందరికీ మంచి కలగాలని ఆకాక్షిస్తూ సంబరాలే కాదు.. మంచి సందేశాలను సైతం కూడా పంచుకుందాం. ఈ కలర్‌ఫుల్ కోట్స్‌తో పండుగను మరింత రంగులమయం చేసుకుందాం.                                                                                            mytahapur-holi-taja-kaburu2పండుగ ప్రత్యేకత ఇదే: హిరణ్య కశ్యపుని సోదరి పేరు హోలిక. ఆమె ఓ రాక్షసి. ప్రహ్లాదుడుని చంపబోయే ప్రయత్నంలో ఆమె దహనమవుతుంది. ఆమెచనిపోయిన రోజును పురస్కరించుకుని హోలీ పండుగను నిర్వహిస్తారని పెద్దలు చెబుతుంటారు. అంతేకాదు, ఫాల్గుణ పౌర్ణమి నేపథ్యంలో కొందరు కాముని పున్నమి పేరుతో కూడా ఈ సంబరాలు నిర్వహిస్తారు. హోలీ పండుగకు మరో కథ ప్రాచీనంలో ఉంది.                                                                  పరమేశ్వరుడికి పార్వతితో వివాహం జరిపించాలని దేవతలు నిర్ణయిస్తారు. దీంతో పార్వతీదేవిపై పరమశివుడి దృష్టి పడేలా చేయాలని మన్మథుని సాయం అడుగుతారు. దీంతో మన్మథుడు తపస్సులో ఉన్న శివుడిపైకి పూల బాణాన్ని ప్రయోగిస్తాడు. తపోభంగం కలిగించాడనే ఆగ్రహంతో శివుడు మూడో కన్ను తెరిచి మన్మథున్ని భస్మం చేస్తాడు. అలా కామ కోరికలు దహింపజేసిన రోజునే హోలీగా నిర్వహిస్తారని అంటారు. ఈ రోజు కొన్ని ప్రాంతాల్లో గడ్డితో మన్మథుడి బొమ్మను తయారు చేసి తగులబెడతారు. ఏది ఏమైనా ఆనందాన్ని పంచే ఈ రంగుల పండుగను మీ కుటుంబికుల కలిసి జరుపుకుంటే ఆ మజాయే వేరు. కానీ, కరోనా వల్ల మనం అందరితో కలిసి ఆనందాన్ని పంచుకొనేందుకు అవకాశం లేదు. కాబట్టి..

 ఈ కలర్‌ఫుల్ కోట్స్‌తో మీ బంధుమిత్రులకు మీకు, మీ కుటుంబ సభ్యులకు హోలీ శుభాకాంక్షాలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here