హరిత హారం తెలంగాణాకు మణిహారం….

0
132

నాటిన మొక్కలు పరిరక్షించాలి..జెడ్పీ చైర్మన్ దావ వసంత సురేష్

జగిత్యాల తాజా కబురు: 6వ విడ‌త తెలంగాణ‌కు హ‌రితహారం కార్య‌క్ర‌మంలో భాగంగా జగిత్యాల రురల్ మండలంలోని చల్గల్,తాటిపల్లి గ్రామల్లో మొక్క‌లు నాటి హ‌రితహారం కార్య‌క్ర‌మాన్నిజెడ్పీ చైర్మన్ దావ వసంత సురేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని,తెలంగాణాకు హరితహారంతో ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్ప కార్యక్రమం చేపట్టారన్నారు..జిల్లా లో నాటిన ప్రతీ మొక్కను రక్షించినపుడే మన లక్ష్యం నెరవేరుతుందని,మొక్కలు నాటడంతో పాటు వాటిని కాపాడేందుకు ప్రత్యేక సిబ్బందిని నియమించి వాటిని పరిరక్షించాలన్నారు..

6వ విడత హరితహారాన్ని విజయవంతం చేసి ముఖ్యమంత్రి మనకు నిర్దేశించిన లక్ష్యాన్ని సాదిద్దామన్నారు..నూటికి నూరు శాతం నాటిన మొక్కలు మనుగడ సాధించేలా చర్యలు తీసుకోవాలి,అందరి ఆలోచనలు పరిగణలోకి తీసుకుని పక్కా ప్రణాళికతో నాలుగేళ్ళ భవిష్యత్ ప్రణాళికతో హరితహారం నిర్వహించాలని ఆమె అన్నారు.ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ శ్రీనివాస్, జగిత్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ దామోదర్ రావు, ఎంపీపీ గంగారాం గౌడ్ ,ప్యాక్స్ చైర్మన్ మహిపాల్ రెడ్డి,సర్పంచ్ గంగానర్సు రాజన్న,రత్నమాల శంకర్ ,ఎంపీటీసీ శ్రీను,మాజీ సర్పంచ్ సత్యం,తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here