స్థల సేకరణ లో నిర్లక్ష్యం వల్ల నీట మునిగిన స్మశాన వాటిక

0
303

వరంగల్ అర్బన్:తాజా కబురు భీమదేవరపల్లి:
గ్రామానికి బడి, గుడి, దవాఖానా ఎంత ముఖ్యమో మానవుడి జీవితంలో ఆఖరి మజిలీ ప్రశాంతంగా జరుపుకునేందుకు వైకుంఠధామం(శ్మశానవాటిక) కూడా అంతే ముఖ్యం. అందుకే చివరకు మనం చేరాల్సిన శ్మశానవాటికకు కూడా ప్రాధాన్యమివ్వాలని, ఇవన్నీ ప్రాథమిక బాధ్యతలని సీఎం కేసీఆర్‌ భావించారు. ప్రతి గ్రామపంచాయతీలోనూ వైకుంఠధామం ఏర్పాటుకు చర్యలను చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. ఈ వైకుంఠధామాలను కేంద్ర ప్రభుత్వ నిధుల సహాయంతో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద నిర్మిస్తున్నారు. ఒక్కో వైకుంఠధామం నిర్మాణానికి ఈజీఎస్‌ నిధులైతే రూ.11.50 లక్షల వరకు, పంచాయతీరాజ్‌ నిధులైతే రూ.12.50 లక్షల వరకు వెచ్చించుకోవచ్చని ప్రభుత్వం నిర్ణయించింది.
కానీ వరంగల్ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని మణిక్యపుర్ గ్రామంలోని స్మశాన వాటిక ముంపు ప్రాంతంలో స్థల సేకరణ చేసి నిర్మాణ పనులు చేపట్టడం వల్ల గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు నీట మునిగింది. స్మశాన వాటిక స్థల సేకరణ సక్రమంగా జరగలేదని ప్రభుత్వ నిధులను ఈ విధంగా దుర్వినియోగం చేయడం సరైనది కాదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి సరైన స్థలంలో వైకుంఠధామాన్ని నిర్మించేలా తగు చర్యలు తీసుకొని ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సంబంధిత ప్రజాప్రతినిధులు, అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here