సౌదీలో పదినిమిషాల్లో విమానం ఎక్కుతాడనుకుండగా గుండెపోటుతో ముత్యంపేట్ గల్ఫ్ కార్మికుడు మ్రతి..

0
295
tajakaburu

సౌదీ ఎయిర్ పోర్టులలో మ్రుతి చెందిన ముత్యంపేట్ గల్ఫ్ కార్మికుడు…

ఉన్నఊర్లో ఉపాధి కరువై బతుకు బారమై ఎడారిదేశాలకు వెళ్లి అసువులుబారుతున్న గల్ఫ్ కార్మికులు ఎందరో, అక్కడ చేసె పనుల వల్ల అనారోగ్యం చెంది మరణిస్తె కనీషం కడచూపు నోచుకోని బాధితులు ఎందరో, జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ముత్యంపేట్ గ్రామానికి చెందిన చిట్యాల రాజలింగం ఉన్న ఊర్లో ఉపాధి లేకా సౌదీ అరేబియా దేశానికి 20 సంవత్సరాలుగా వెళుతున్నాడు, అక్కడి B G C Company  Saudi jedda lo పని చేస్తున్నాడు,గత కొంత కాలంగా అనారోగ్యం చెయ్యటంతో అక్కడి అసుపత్రిల్లో ట్రిటిమెంట్ తీసుకున్నాడు, అలా పని చేస్తున్న క్రమంలో కంపెనీ  4 నెలలుగా జీతం ఇవ్వలేదు, దాంతో తన వద్ద ఉన్న డబ్బులతో అక్కడి వైద్యం చేయించుకున్నాడు, కానీ అక్కడి వైద్యం బాగా ఖరీదైంది ఇదే విషయం  కంపెనీకి పరిస్థితి వివరిస్తె కంపెనీ విసాను క్యాన్షిల్ చేసింది,ఆయనకు రావాల్సిన డబ్బులను అప్పజెప్పి ఇండియాకు వెళ్లాలని చెప్పింది,అప్పటి నుండి తనవద్ద ఉన్న డబ్బులతో తాను వైద్యం చేయించుకుంటు ఇండియాకు వచ్చేందుకు ప్రయత్నించాడు, కానీ కరోనా ఉండటంతో అక్కడినుండి ఇండియాకు వచ్చె అవకాశం లేకుండా పోవటంతో  రాజలింగం కఇదె విషయం నిత్యం ఇంట్లోవాళ్లకు చెపుతుండెవాడు, కేంద్రప్రభుత్వం గల్ఫ్ కార్మికుల కోసం పెట్టిన వందెమాతరం విమానం లో వచ్చెందకు పలుసార్లు దరఖాస్తు చేసుకున్నాడు, అలాగె ప్రయత్నించిన రాజలింగం కు వందేమాతరం విమానంలో వచ్చెందుకు అవకాశం రావటంతో కంపేనివాళ్లు అతనికి ఆరోగ్య సమస్య ఉందని ఎంబేసి తెలిపి అతన్ని పంపించారు, 28 09 2020 రోజు సౌదీ ఎయిర్ పోర్టులో అన్నీ కార్యక్రమాలు పూర్తి చేసుకొని విమానం మరో పదినిషాల్లో ఎక్కుతాడు అనెలోపు గండెపోటు వచ్చింది, అక్కడి వైద్యులు చికిత్స అందించెలోపె అతను మ్రుతి చెందాడు, అప్పటికె రాజలింగం కొడుకు తన తండ్రిని ఎయిర్ పోర్టు నుండి తీసుకువస్తానని వెళ్లి మార్గమద్యలో విషయం తెలియటంతో బోరున విలపించాడు, రాజలింగం మ్రుతదేహాం  28 నుండి అక్కడె ఉంది, మ్రతదేహాన్ని ఇండియాకు తెప్పించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. రాజలింగం కు బార్య, ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు, 20 యసంవత్సరాల నుండి గల్ఫ్ దేశాలకు వెళుతున్న దయనీయమైన పరిస్థితి, పిల్లలకు ఎవరికి ఇంకా వివాహాం కాలేదు, మరో కొన్ని గంటల్లో తమ కళ్లముందు ఉంటాడనున్న వాళ్లకు అతను లేడు అనె మాట ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు.తన భర్త మ్రుతదేహాన్ని  ఎలాగైన తెప్పించాలని అతని భార్య చిట్యాల లక్ష్మి కోరుతుంది..  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here