సోషల్ మీడియాలో అక్రమ ఇసుక రవాణా ఫోటోలు వైరల్

0
62

రాయికల్ తాజా కబురు: మండలంలోని ఇటిక్యాల, రామరావుపల్లె గ్రామాల నుండి నిత్యం జోరుగా అక్రమ ఇసుక రవాణా జరుగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదంటూ మండలానికి చెందిన పలువురు యువకులు అక్రమ ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్ల ఫొటోలు తీసి సామజిక మాద్యమాలైన ఫేస్ బుక్, వాట్సాప్ గ్రూప్ లలో పోస్టు చేస్తూ,ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోవాలంటూ కోరుతున్నారు.రాత్రి వేళలో నిత్యం ఇటిక్యాల పెద్ద వాగు నుండి ఇసుక అక్రమ రవాణా జరుగుతున్న అధికారులు మాత్రం నెలకు ఒకటి, రెండు ట్రాక్టర్లను పట్టుకొని నామమాత్రం ఫైన్ విధించి వదిలి పెడుతుండటంతో అక్రమ ఇసుకసురులు తిరిగి అదే మార్గాన్ని ఎంచుకొని అక్రమ ఇసుక రవాణాను కొనసాగిస్తున్నారు.అధికారుల అండ దండలతోనే మండలంలో అక్రమ ఇసుక రవాణా జోరుగా కొనసాగుతుందని మండల ప్రజలు చర్చించుకుంటున్నారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here