సెప్టెంబర్ 1 ఉద్యోగ ఉపాధ్యాయులకు చీకటి దినం

0
78

తాజా కబురు రాయికల్: ప్రభుత్వం కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం అమలు చేసిన సెప్టెంబర్ 1 వ తేదీ ఉద్యోగ ఉపాధ్యాయులకు చీకటి దినమని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాయికల్ మండలశాఖ సభ్యులు ఆవేదన వ్యక్తంచేశారు. తపస్ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు మంగళవారం పెన్షన్ విద్రోహ దినంగా పాటించారు. మధ్యాహ్న విరామ సమయంలో రాష్ట్రప్రభుత్వం సి.పి.యస్ విధానం రద్దుపరిచి పాతపెన్షన్ విధానమే అమలుచేయాలని కోరుతూ మండల తహశీల్దార్ కె.మహేశ్వర్ కు వినతిపత్రాన్ని అందజేశారు. అన్ని పాఠశాల ల్లో నల్ల బ్యాడ్జీలతో ఉపాధ్యాయులు నిరసన వ్యక్తంచేశారు.ఈ కార్యక్రమంలో తపస్ రాష్ట్ర బాధ్యులు ఎ.రాజేంద్రప్రసాద్, జిల్లా కార్యదర్శి చెరుకు మహేశ్వర శర్మ ,మండలశాఖ అధ్యక్షులు బెజ్జెంకి అనిల్ రావు, కార్యదర్శి రాజేందర్, సభ్యులు ఎద్దండి రమేశ్,వి.మధు నీలి నాగరాజు జయదేవవర్మ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here