సూర్యస్తమయంలోగా గణేష్ నిమజ్జనంపూర్తి చేసుకోవాలి జిల్లా కలెక్టర్ జి. రవి

0
94

తాజా కబురు జగిత్యాల :గణేష్ నిమజ్జన్నాన్ని కోవిడ్ నిబందనలు పాటిస్తూ సూర్యస్తమయంలోగా పూర్తిచేసుకోవాలని జిల్లా కలెక్టర్ జి. రవి అన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గణేష్ నిమజ్జణ ఏర్పాట్లు, కోవిడ్ నిబంధనలు అమలుపై అధికారులతో శుక్రవారం సమీక్షించారు. ఈ సందర్బముగా కలెక్టర్ మాట్లాడుతూ గణేష్ నిమజ్జనాన్ని పురస్కరించుకొని ఎక్కవ మంది నిమజ్జన ఘాట్ వద్దకు రాకుండాదని, తప్పకుండా కొవిడ్ నిబందనలను పాటించాలని సూచించారు. నిమజ్జనాన్ని ఉదయం ప్రారంభించి సాయంత్రంలొగా పూర్తిచేయాలని అన్నారు. నిమజ్జన ఘాట్ ల వద్ద సానిటైజెషన్ చేయించాలని. లైట్లు, బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు, గజఈతగాళ్లను కూడా అందుబాటులో ఉంచుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రతి ఒక్కరు తప్పక మాస్కులను దరించాలని, మాస్కులు ధరించకుండా, అనవసరంగా గుంపులుగా వుండె వారిని గుర్తించి వారికి ఫైన్ వేయడంతో పాటు కోవిడ్ నిబంధలను పాటించని దుకానాలను సీజ్ చేయాలని, అధికారులను ఆదేశించారు. కోవిడ్ పాజిటివ్ గా నిర్దారణ అయిన వారు కచ్చితంగా హొం ఐసోలేషన్ లో వుండెలా చూడాలని, నిబందనలు పాటించకుండా బయటకు వచ్చేవారిపై కేసులు పేట్టాలని అన్నారు. ఎప్పటికప్పుడు పాజిటివ్ గా నిర్దారణ అయిన వారి ఇంటి పరిసర ప్రాంతాలతో పాటు , చుట్టు ప్రక్కల కూడా సానిటైజేషన్ జరిగేలా అధికారులు చర్యలు చేపట్టాలని అన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు కొవిడ్ నిర్దారణ పరీక్షలను కచ్చితంగా చేయించుకోవాలని సూచించారు. ఈ వీడియో కాన్పురెన్స్ లో అడిషన్ కలెక్టర్ బి.రాజేషం, అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడిస్ శ్రీమతి అరుణశ్రీ, జెడ్పి సీఈవో శ్రీనివాస్, జగిత్యాల డిఎస్డిఓ వెంకటరమణ ఇతర అధికారులు పాల్గోన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here