రాయికల్ తాజా కబురు: మండలంలో బుధవారం రాత్రి ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో గురువారం మైతాపూర్ గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎంపీటీసీ సభ్యులు రాజనాల మధు కుమార్ సందర్శించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుమారు 4వేల క్వింటాల్ల వరి ధాన్యం బస్తాలు తడిసి ముద్దయినాయని మండల వ్యాప్తంగా అన్ని కేంద్రాల్లో కొనుగోళ్లు పూర్తి కాగా మండల కేంద్రం తో పాటు గ్రామంలో ప్రా.వ్య.స.సంఘం సి.ఈ.ఓ నిర్లక్ష్యం చేయడం,తూకంలో అలసత్వం వల్లే ఇంకా ధాన్యం మిల్లులకు పంపడం లేదని, అసలే తప్ప తాలు పేరుతో మిల్లర్లు బస్తాకు 10కిలోల కోత విధిస్తున్నారని,మిల్లర్లు తడిసిన ధాన్యం పేరుతో ఇపుడు రైతులను ఇబ్బందులకు గురి చేయడం సరికాదని వెంటనే ధాన్యం బస్తాలను మిల్లులకు తరలించే ఏర్పాటు చేయాలని లేని పక్షంలో రైతులతో కలిసి నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.
Home ఇంటర్వ్యూలు సి.ఈ.ఓ నిర్లక్ష్య వైఖరి వల్లనే ధాన్యం ఆలస్యంగా మిల్లులకు తరలింపు- ఎంపీటీసీ సభ్యులు రాజనాల మధు...