సింగరేణిలో మెగా వ్యాక్సినేషన్ ని విజయవంతం చేయండి

0
18

తాజా కబురు సింగరేణి: సింగరేణి కార్మికులకు అందరికీ కరోనా వ్యాక్సిన్ అందించాలని సింగరేణి యాజమాన్యం మెగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని, దీనిలో భాగంగా శుక్రవారం మందమర్రి ఏరియాలోని కేకే 5 గని పై మెగా వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో కార్మికులు పాల్గొని, విజయవంతం చేయాలని కేకే 5 గని మేనేజర్ శంకరయ్య పేర్కొన్నారు. గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, శుక్రవారం ఉదయం 2,3 షిప్ట్ కార్మికులకు వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుందని, సాయంత్రం మొదటి, జనరల్ షిప్ట్ కార్మికులకు వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. కేకే 5 గని కార్మికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here