సారు సర్కారు భూములను కాపాడండి

0
241

రాయికల్ తాజా కబురు: మండలంలోని వస్తాపూర్ గ్రామంలోని చెరువు ప్రభుత్వ భూమిని కొందరు ఆక్రమించి కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని సోమవారం ఉపసర్పచ్ ఎస్.కె ముజాయిద్ తో పాటుగా గ్రామ యువకులు తహసీల్దార్ మహేశ్వర్ కు పిర్యాదు చేసారు. గ్రామంలోని సర్వే నెంబర్ 50 కి సంబంధిచిన ప్రభుత్వభూమి అన్యక్రాంతం అవుతుందని సర్వే చేసి హద్దులు నిర్ణయించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో యువకులు కన్నేవేణి జీవన్, గంగాధర్, నర్సయ్య, రాజేష్, భూమారెడ్డి, చిన్న, రాయుడు పాల్గొన్నారు. అలాగే గత సంవత్సరం అక్టోబర్ నెలలో మండలం లోని మైతాపూర్ గ్రామానికి చెందిన గనె గుట్ట ప్రాంతం ఆక్రమణకు గురి అవుతుందని సర్వే జరిపించి హద్దులు నిర్ణయించాలని ఆలయాల పరిరక్షణ కమిటీ సభ్యులు పిర్యాదు చేసినారు. మండలం లోని పలు గ్రామాలలోని ప్రభుత్వ భూములు కుంటలు, చెరువులకు ఇకనైనా హద్దులు నిర్ణయించకపోతే ప్రభుత్వ భూములు కబ్జాకు గురి అవుతాయని, సంబంధిత అధికారులు సర్వే జరిపి ప్రభుత్వ ఆస్తులను కాపాడాలని సామజిక వేత్తలు కోరుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here