సాధువులను హత్య చేసిన వారిపై చర్యలు తీసుకోండని వినతి

0
173

రాయికల్ తాజా కబురు: మహారాష్ట్ర పాల్గర్ లో సాధువులను అతి కిరాతకంగా కొట్టి చంపిన వారిపై, వారి వెనక ఉన్న సంస్థలపై తగు చర్యలు తీసుకోవాలని మంగళవారం రాయికల్ తహసీల్దార్ మహేశ్వర్ కు విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ గత వారం క్రితం తమ గురువు అంత్యక్రియలకు వెళుతూ మహారాష్ట్రలోని పాల్గర్ గ్రామంలో స్థానికులైన మత దురహంకార కిరాతక హంతక ముఠా ఒక పథకం ప్రకారం జరిగిన దాడి సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నదని. సదా సమాజ క్షేమం కోసం ఆధ్యాత్మిక జీవితం గడిపే సాదు పురుషులైనా స్వామి శ్రీ కల్పవృక్ష గిరి మహారాజ్, స్వామి శ్రీ సుశీల్ గిరి మహారాజ్ మరియు వారి సహాయకులు నీలేష్ను అతి కిరాతకంగా కర్రలతో కొట్టి, 70 సంవత్సరాల వయోవృద్ధుడు అని చూడకుండా పోలీసుల సమక్షంలో దారుణంగా కొట్టి హింసించి హతమార్చారని , ఈ సంఘటన యావత్ భారత దేశంలో హిందూ సమాజం తీవ్ర దిగ్భ్రాంతికి గురైందని , ఈ దాడిలో పాల్గొన్న వ్యక్తులపై సహకరించిన స్థానిక కష్ట కారి సంఘటన్ అనే ఎన్జీవో పై, ప్రేక్షక పాత్ర వహించిన పోలీసులపై చట్టప్రకారం చర్య తీసుకొని కఠినంగా శిక్షించాలని విశ్వహిందూ పరిషత్ రాయికల్ ప్రకాండ కార్యకర్తలు, చత్రపతి శివాజీ హిందూ యువసేన రాయికల్ మండల శాఖ ప్రభుత్వాన్ని కోరుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో చత్రపతి శివాజీ హిందూ యువసేన రాష్ట్ర అధ్యక్షులు బోడుగం మోహన్ రెడ్డి , విశ్వ హిందూ పరిషత్ ప్రఖండ అధ్యక్షులు K. N. స్వామి, విశ్వ హిందూ పరిషత్ ప్రఖండ కార్యదర్శి కాయితి గంగాధర్, పటేల్ రాము, శెట్కార్ మధు, బాబురావు. చత్రపతి శివాజీ హిందూ యువసేన జిల్లా అధ్యక్షుడు లావుడ్య రాజేష్, గుడికందుల ఆంజనేయులు, గుగ్లావత్ మహేందర్, విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here