సాక్షి సామ్రాజ్యంలో విలీనం కానున్న టివి9 గ్రూప్…? త్వరలోనే నిర్ణయాన్ని ప్రకటించనున్న ఇరు యాజమాన్యాలు…

0
153
tajakaburu
Tajakaburu

తాజాకబురు హైదారాబాద్: సాక్షి చేతిలోకి టివి9 రాబోతుందా, సాక్షి గ్రూపులోకి టివి9 వచ్చి చేరబోతుందా, అసలు అంత పెద్ద నెట్వర్క్ విలీనం కావటం ఏంటి అనుకుంటున్నారా ,అవును అవసరాలు, పరిస్థితిలు ఎప్పుడు ఎలా మారుతాయో ఎవరికి తెలుసు, ఒకప్పుడు న్యూస్ అంటె రవిప్రకాశ్, రవి ప్రకాశ్ అంటె న్యూస్ గా ఉండేది అలాంటిది ఆయన జాడనె లేకుండా పోయింది, ఎప్పుడు ఎలాంటి పరిస్థితి వస్తుందో ఊహించలేం కదా…అలా ఊహిస్తె అది జీవితం ఎలా అవుతుంది, ఇప్పుడు ఇరు రాష్ర్టాల మద్య హాట్ టాఫిక్ గా మారిన న్యూస్, సాక్షి చేతిలోకి చేరబోతున్న టివి9,…అసలు నిజనిజాలు ఏంటి ఇప్పుడు వైరల్ అవుతున్నట్టుగా నిజంగానే సాక్షి లోకి టివి9 వెళుతుందా…

ఇప్పుడు చక్కర్లు కొడుతున్న వార్తను ఒక్కసారిగా చదువుదాం….

తెలుగు మీడియా రంగంలో సంచలనం టివి9.  ఏ రాష్ట్రంలో లేనన్నీ న్యూస్ ఛానెల్స్ తెలుగునాట ఉన్నాయంటే దాని వెనుక స్ఫూర్తి టివి9.  ఒక్క తెలుగులోనే కాకుండా కన్నడ,గుజరాత్ తో సహా ఇతర రాష్ట్రాల్లో టివి9 ని నిలబెట్టడంలో రవిప్రకాష్ ది కీలక పాత్ర.  2019 ఎన్నికల తరువాత జరిగిన పరిణామాలు అందరికీ విదితమే.  ఏపీలో అపర కుబేరుల లిస్ట్ లో ముందున్న రామేశ్వరరావు, మెగా కృష్ణా రెడ్డి టివి9 ని దక్కించుకోవడం రవిప్రకాష్ని మెడపట్టి బయటకు గెంటడం జరిగి పోయింది. ఇక్కడి వరకూ వారు అనుకున్నట్టే అంతా జరిగినా తెలుగులో నెంబర్ 1గా కొనసాగుతున్న టివి9 ని అదే పంధాలో నడిపించడం బిజినెస్ లో నెంబర్ 1 గా వారికి సాధ్యమవ్వలేదు.  అనేక సమస్యలు, రాజకీయ ఒత్తిడుల కారణంగా ఛానల్లో అనేక మార్పులు చేసారు.  ఒక్క సరిగా దేశవ్యాప్తంగా ఉన్న టివి9 ఛానెల్స్ రేటింగ్స్ పడిపోవడం ప్రారంభం అయ్యింది.  ఒక్కప్పుడు టివి9 దరిదాపుల్లో లేని ఛానెల్స్ ఇప్పుడు టివి9 రేటింగ్స్ దాటేయ్యడం యాజమాన్యానికి తలనొప్పిగా మారతాయి.  యాడ్స్ రెవెన్యూ కూడా భారీగా పడి పోయింది.  పై పెచ్చు బిజినెస్ లాబీయింగ్ లో భాగంగా రాజకీయ నాయకులు ఛానెల్లో ఫేవర్ అడగడం కూడా తలనొప్పిగా మారింది.  ఒక పక్క టిఆర్ఎస్ మరోపక్క వైఎసార్సీపి కి రెండు రాష్ట్రాల్లో మద్దతు ఇవ్వడమే లక్ష్యంగా ఛానెల్ రన్ చేస్తున్నా ఆ మేర రేటింగ్స్ రాకపోగా రేటింగ్స్ రివర్స్ అవ్వడం వారిని కలవర పెడుతుంది. 

ఇలాంటి సమయంలో టివి9 ని బిజినెస్ వ్యక్తులు కాకుండా మీడియా లో ప్రొఫెషనల్స్ గా ఉండి జగన్ ముఖ్యమంత్రి కావడానికి కీలక భూమిక పోషించిన సాక్షి యాజమాన్యం కి అప్పగించాలని ప్రణాళిక సిద్ధం అయ్యింది.  లోటస్ పాండ్ లో జరిగిన ఒక ముఖ్య సమావేశంలో ఇరు ఛానెల్స్ యాజమాన్యం సుదీర్ఘంగా చర్చించుకొని ఒక అంగీకారానికి వచ్చారు.  రెండు ఛానెల్స్ ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నారు.  ఒప్పందంలో భాగంగా పూర్తి స్థాయిలో ఎడిటోరియల్ బాధ్యతలు అన్ని సాక్షి తీసుకోనుంది.  రూ.750 కోట్ల కు కొత్తగా టివి9 ఏర్పాటు చేసిన భారత్ వర్ష్ ఛానల్ తో కలిపి సాక్షి కి అప్పగించడానికి ఒప్పందం జరిగింది.  ఇప్పటి వరకూ తెలుగు మీడియా లో ఆ న్యూస్ ఛానెల్ కి ఎంత పెద్ద మొత్తంలో మార్కెట్ జరగలేదని మార్కెట్ వర్గాలు అంటున్నాయి.  త్వరలోనే కావాల్సిన ఏర్పాట్లు పూర్తి చేసి ఇరు యాజమాన్యాలు ఒక ప్రకటన చేయనున్నారు అని సమాచారం…..???

తెలుగు మీడియా రంగంలో అతి పెద్ద సంచలనం… టివి9 ని తిరిగి దక్కించుకోవాలని రవి ప్రకాష్ పెట్టుకున్న ఆశలు అడియాసలు…టివి9 ని సాక్షి గ్రూప్లో విలీనం చేసేందుకు తుది దశకు చేరుకున్న చర్చలు….!!!

తెలుగు మీడియా రంగంలో అతిపెద్ద డీల్ ఇదే అంటున్న మార్కెట్ వర్గాలు…

చివరగా…అవసరం ప్రతి ఒక్కరి సమయాన్ని, పరిస్థుతులను దగ్గర చేస్తుంది, దూరం చేస్తుంది, ఇప్పుడు ఇరువురు సీయంల మద్య ఉన్న సాన్నిహిత్యం ఎలాంటి నిర్ణమైన తీసుకునెలా చేస్తుంది..

ఏది ఏమైనా మంటలేనిది పొగ రాదు, ఏదో ఓ చర్చ జరగనిది బయటకు రాదు, ఏమో గుర్రం ఎగరావచ్చు….

చివరగా…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here