సహజ ఉత్పాదనలకు బ్రాండ్ అంబాసిడర్లు స్వయంసహయక సంఘాలే: కలెక్టర్ జి.రవి

0
34

జగిత్యాల తాజా కబురు :జిల్లాలో స్వయం సహాయక సంఘాల ద్వారా ఉత్పత్తి కాబడే ఉత్పాదనలకు మనమే అం బాసిడర్లు గా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ జి.రవి అన్నారు.శని వారం జిల్లా కేంద్రంలోని పోన్నాల గార్డెన్స్ లో జిల్లా గ్రామీణాభివృద్ది శాఖ ఆద్వర్యంలొ రిటేల్ ఆవుట్ లెట్ మరియు పోషన్ అభియాన్ లో అవగాహన కార్యక్రమంలో ము ఖ్యఅతిధిగా పాల్గోన్నారు.ఈ సంద ర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ,సహ జ ఉత్పత్తులు ద్వారా ఏ విదంగా ఆదాయం అభివృద్ధి పొందే విష యాలు తెలుసుకునేలా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరి గిందని పెర్కోన్నారు.జిల్లాలో మహి ళా సంఘాలు వారి కార్యక్రమాల ద్వారా మిగతా జిల్లాలకు స్పూర్తిదా యకంగా నిలుస్తారని అన్నారు. ఋణాలను తీసుకొని ఆర్థిక ఎదు గుదలకు ఉపయోగించుకోవడంలో స్పూర్తిదాయకంగా నిలిచారని, మహిళలు తయారుచేసే వస్తువు లకు మార్కెటింగ్ కల్పించి వారి ఆర్థికాభివృద్ది కొరకు రాష్ట్ర సంక్షేమ శాఖ మాత్యులు పైలెట్ ప్రాజెక్టు ద్వారా అన్ని రకాల అనుమతు లతో జిల్లాలో సహజ బ్రాండ్ ను ప్రవేశపెట్టారని అన్నారు.మహిళా సంఘాల ద్వారా తయారు చేయబ డుతున్న వస్తువులకు మార్కేటింగ్ కలగాలంటే ముందుగా మనమే వాడి,దాని గురించి ఇతరులకు వివరించే ఉద్దేశ్యంతో ముందుగా కొన్ని రకాల ఉత్పత్తులను మొదట గా మార్కేటింగ్ చేయడం జరిగింద ని పేర్కొన్నారు.ప్రతి గ్రామాలలో స హజ ఔట్ లెట్లు ఏర్పాట్లు చేసి అ మ్మకాలు ప్రారంబించడం ద్వారా ఆదాయం పెరగుతుందని,నాన్య మైన ఉత్పత్తులను తయారి ద్వారా ప్రజల్లో నమ్మకం కలిగించడం ద్వా రా అమ్మకాలు పెరిగి మరింత ఆర్థి కంగా ఎదగడానికి వీలుకలుగు తుందని పేర్కోన్నారు.వ్యవసాయా దారిత పనులు చేసుకుంటునే,స్వ యం ఉత్పాదనల పై దృష్టిసారించి ఇతర జిల్లాతో పాటు రాష్ట్రంలో అమ్మకాలు ప్రారంభించగలుగుతా మని అన్నారు.మార్కెటింగ్ ప్రకా రం ఉత్పాదనలు కొనుగోలు దారు నికి అందించేలా కృషిచేయాలని, అర్గానిక్ ఆహరపదార్థాల తయా రిపై దృష్టిసారించి,నాణ్యమైన వస్తువులను తయారు చేయగలర ని నమ్మకాన్ని కల్పించాలని,ప్రతి గ్రామంలో 3 రిటైల్ అవుట్ లేట్ ఏర్పాటుకు ఋణాల మంజూరుకు ప్రభుత్వం సానుకులంగా ఉన్నందు న జిల్లాలో కార్యక్రమాన్ని విజయం వంతం చేయాలని సూచించారు. పోషన్ అభియాన్ కార్యక్రమంలో బాగంగా జిల్లాలో సుమారు 6వేల మంది అంగన్ వాడి పిల్లలు ఆరో గ్యం సరిగా లేక ఇబ్బందులు ఎదు ర్కొంటున్నట్లు గుర్తించడం జరిగిం ది.మనం ఇంటికి కావాలసిన కూర గాయలు,పప్పుదినుసులను అమ్మి వేయడం కాకుండా కొంత వారి కో సం ఉంచుకొని పౌష్టికాహారం తీసు కోవాలని మరియు ఆర్థికాభివృద్ది సరిగా లేని వారిని గుర్తించి వారికి తక్కువ ఖర్చుతో వారికి అందించా లని,ప్రభుత్వం అందజేసే సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలను విజయ వంతం చేయడంలో ఎల్లప్పుడు ముందుండాలని తెలియజేశారు.
మంత్రి పి.ఎస్ మాట్లాడుతూ, జిల్లాలో సహజ బ్రాండ్ ఉత్పాద నలకు మార్కెటింగ్ కలిగించడంలో మంత్రి స్థాయిలో కృషి చేయడం జరిగిందని,సహజ బ్రాండ్ ను రిజి స్ట్రేషన్ చేసుకోవాలని,అన్నిరకాల లైసెన్స్ తీసుకోవడం వలన మార్కె టింగ్ అవకాశాలు ఎక్కువగా లబి స్థాయని పేర్కోన్నారు.మనం త యారు చేసే వస్తువులను మనమే మార్కెటింగ్ చేసుకోవడం అనే నినాదంలో అందరు ముందుకు వెళ్లాలని,సహజ బ్రాండ్ వారి ద్వా రా తయారు చేయబడుతున్న స బ్బులతో పాటు,ప్రతిరోజు వాడుకు నే వస్తువులను కూడా ఉత్పత్తి చేయడంలో మహిళా సంఘాలు ముందుకు రావాలని పేర్కోన్నారు. సహజ ద్వారా ఉత్పతి చేయబడిన ఉత్పాదనల కొరకు హైదరాబాద్ నుండి గాజు బాటిల్స్ తెప్పించి అమ్మకాలు చేయడం జరుగుతుం దని,మరిన్ని ఉత్పాదనలను తయా రు చేసి మన వస్తువులకు మరింత పేరు ప్రఖ్యాతలను తీసుకువచ్చే విధంగా కృషిచేయాలన్నారు.
అదనపు కలెక్టర్ బి.రాజేషం మాట్లా డుతూ,జిల్లా సమాఖ్యలో గతంలో నే తీర్మాణించిన అనుకొని కారణా ల వలన కార్యక్రమం ముందుకు వెల్లలేదని,స్వయం సహయక బృందాల ద్వారా వస్తులను ఉత్ప త్తి చేయబడి,స్థానికంగా ఉన్న వన రులను వినియోగించుకొని ఆర్థికం గా ఏవిధంగా ఎదుగుతామే గుర్తిం చి ఆర్థికంగా ఎదుగుతామే గుర్తిం చాలని పేర్కోన్నారు.స్వంత నిధు లతో తయారు చేసిన వస్తువులను తయారు చేసుకుంటున్నారని,ఆర్థిక సహయం కొరకు మంత్రికి తెలియ జేయడం జరిగిందని పేర్కోన్నారు. ప్రతిఒక్కరి లో ప్రతిభ ఉంటుందని, దానిని గుర్తించి మీ ఇంటి దగ్గర మీ రు చేయగల వస్తువులను తయా రు చేసుకొంటున్నారని,వాటికి మా ర్కెటింగ్ అందించాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర సంక్షేమశాఖా మాత్యులు సహజ బ్రాండ్ ను ప్రవేశపెట్టడం జరిగిందని పేర్కోన్నారు.
ఈ కార్యక్రమంలో పి డి డి ఆర్ డి ఎ లక్ష్మీనారాయణ డిడబ్ల్యు ఓ నరేష్ అన్ని మండలాలకు చెందిన స్వయంశక్తి సంఘాల లీడర్లు సభ్యు లు వివోలు విఏవో లు అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here