సరిహద్దు సమస్య పరిష్కరించకుండా ఎన్నికలకు వెల్లోద్దు–గొల్లపల్లి గ్రామస్తులు

0
26

రాజన్న సిరిసిల్ల /ఇల్లంతకుంట తాజా కబురు:
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం గొల్లపల్లి గ్రామ పంచాయితీ లో సరిహద్దు సమస్య ను పరిష్కరించకుండా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయవద్దని ఒక్కవేళ సమస్య పరిష్కరించకుండా అధికారులు నోటిఫికేషన్ విడుదల చేస్తే ఎన్నికలను బహిష్కరించలని గొల్లపల్లి గ్రామ ప్రజలు ఈ రోజు ఏకగ్రవంగా తీర్మానం చేసుకున్నారు.
గతంలో రెండు సార్లు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన గ్రామంలో 148 మంది ఓటర్లును తమకు సంబంధించిన ఇండ్ల స్థలాలను, వ్యవసాయ భూములను కొత్తగా ఏర్పాటు చేసిన వెంకట్రావుపల్లి గ్రామ పంచాయతీ లో అన్యాయంగా కలిపారని దాని కారణంగా నామినేషన్ వేయకపోవడంతో ఇప్పటి వరకు గ్రామపంచాయతీ కి సర్పంచ్ లేడు అనే విషయం అందరికి తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న మండల అధ్యక్షులు ఊట్కూరి వెంకట రమణ రెడ్డి అక్కడకి చేరుకొని మనకొండూర్ శాసన సభ్యులు రసమయి బాలకిషన్ దృష్టి కి తీసువెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేసేలా చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో అన్ని కుల సంఘాల అధ్యక్షులు ,మహిళ సంఘాల సభ్యురాళ్లు, రైతులు, యువజన సంఘం నాయకులు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here