సమయ పాలన లేని మధ్యం అమ్మకాలు
ఉదయం నుండే బారులు తీరిన మందు బాబులు
రాయికల్ తాజా కబురు: కరోనా వైరస్ వ్యాప్తి,లాక్ డౌన్ నేపత్యం లో గత రెండు నెలలుగా మధ్యం అమ్మకాలు బంద్ చేయగా ప్రభుత్వ ఆదేశాల మేరకు బుధవారం ఉదయం 10 గంటలకు పోలీసుల నిఘాలో మధ్యం అమ్మకాలను ప్రారంభించారు. మండలంలోని అల్లీపూర్, రాయికల్ మధ్యం దుకాణాల ముందు ఉదయం మందు బాబులు బారులు తీరగా, మధ్యం దుకాణాలను ఎప్పటికప్పుడు ఎక్సయిజ్ ఎస్.ఐ సరిత, స్థానిక ఎస్.ఐ ఆరోగ్యంలు పర్యవేక్షిస్తూ సామజిక దూరం పాటించాలని సూచించారు. కాగా సాయంత్రం 6 గంటలకు మూసివేయాల్సిన మధ్యం దుకాణాలు మాత్రం సమయ పాలనా పాటించకుండా అమ్మకాలు జరుపుతుండటం, అధికారులు కూడా చూసి చూడనట్లుగా ఉంటున్నారని పట్టణ ప్రజలు తెలుపుతున్నారు.
సాయంత్రం 6 తర్వాత తెరిచి ఉంచిన మధ్యం దుకాణాలు