సఖి సెంటర్ మరింత సమర్థవంతంగా నిర్వహించాలి: కలెక్టర్ కె.శశాంక

0
18

మూడు నెలల్లోగా సఖి కేంద్ర భవనాన్ని పూర్తి చేయాలి

కరీంనగర్ టౌన్ తాజా కబురు: జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న సఖి కేంద్ర భవనాన్ని మూడు నెలల్లోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కె శశాంక అధికారులను ఆదేశించారు.శని వారం కరీంనగర్ పట్టణంలోని సప్తగిరి కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న సఖి కేంద్రం భవనాన్ని ఆయన సందర్శించారు.భవనము ను పరిశీలించి తగు సూచనలు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన భవనాన్ని జూన్ మాసంలో గా పూర్తిచేయాల ని కాంట్రాక్టర్లు అధికారులు ఆదేశిం చారు. కలెక్టర్ అంతకుముందు ముకరంపుర లోని సఖి సెంటర్ ను ఆయన సందర్శించి రికార్డులను పరిశీలించారు.సఖి కేంద్రం లో ఇప్ప టివరకు ఎన్ని కేసులు నమోద య్యాయని,ఎన్ని కేసులు పరిష్కార మయ్యాయని అడిగి తెలుసుకు న్నారు.మహిళల హక్కుల రక్షణకు సఖి కేంద్రం న్యాయపరంగా సహా య,సహకారాలు అందించాలని, సఖి కేంద్రం మరింత సమర్ధవం తంగా పనిచేయడానికి తగు సల హాలు,సూచనలు కలెక్టర్ చేశారు. యుక్తవయస్సు బాలబాలికలకు జెండర్ మరియు సామాజిక అం శాలపై అవగాహన తో పాటు వారి వ్యక్తిగత అభివృద్ధి,వారి రోజు వారి జీవితంలో ఎదుర్కొనే ఇబ్బందుల ను పరిష్కరించుకునేలా వారికి అవగాహన కల్పించాలన్నారు. కేంద్రానికి వస్తున్న కేసులలో ఎ క్కువ కేసులు గ్రహించక సంబంధిం చిన ఉన్నందున వారి ఆర్థిక అభి వృద్ధి తో పాటు వారి లో దాగి ఉన్న నైపుణ్యాలను గుర్తించి వారు ఆర్థిక స్వావలంబన దిశగా వెళ్లే విధంగా మార్గదర్శనం చేయాలన్నారు.సఖి కేంద్రానికి వచ్చిన కేసుల కుటుంబ సామాజిక మరియు ఆర్థిక పరిస్థితు లను అనాలసిస్ చేయాలన్నారు అలాగే వారికోసం ఉన్నా సపోర్ట్ వ్యవస్థలు,సంస్థలతో కలిసి పనిచే సే విధంగా సమన్వయం చేయాల న్నారు.జిల్లాలోని అన్ని గ్రామాలలో విస్తృతంగా అవగాహన కార్యక్రమా లు చేపట్టడంతో పాటు ప్రభుత్వ, ప్రైవేట్ సెంటర్లలో వర్క్ చేస్తున్న సిబ్బందికి మరియు అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న అందరికీ అవ గాహన కల్పించాలన్నారు.సఖి కేం ద్రానికి ఇప్పటి వరకు 400 ఫిర్యా దులు రాగ వాటిని పరిష్కరించడం జరిగిందన్నారు.కేంద్ర ప్రభుత్వం ని ధులు 48.69 లక్షలు రూపాయల వ్యయంతో కరీంనగర్ పట్టణంలోని సప్తగిరి కాలనీలో నూతనంగా నిర్మి స్తున్న సఖి కేంద్రం కార్యాలయ భవ నము సందర్శించి పనులను పరిశీ లించారు.భవన నిర్మాణం జూన్ మాసంలో పూర్తిచేయాలని కాంట్రా క్టర్లు అధికారులు ఆదేశించారు.అ నంతరం కలెక్టర్ బాల రక్షక భవన్ అద్దె భవనములు పరిశీలించి తగు ఆదేశాలు జారీ చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి సిహెచ్ శారద,సఖీ కేంద్రం అడ్మినిస్ట్రేటర్ డి లక్ష్మి,బాల రక్షక భవన్ అధికారి సరస్వతీ,లీగల్ కౌన్సిలర్ ఆర్.సమత రెడ్డి,సోషల్ కౌన్సిలర్ ఎస్.రేణుక,కరీంనగర్ రూరల్ తహసిల్దార్ సుధాకర్ తది తరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here